అఖిలప్రియ నా కూతురులాంటిది: ఏవీ సుబ్బారెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తనకు కూతురులాంటిదని , నంద్యాల టిడిపి నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. తమ మధ్య సమస్యలు లేవన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

కర్నూల్ జిల్లా నేతలతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో శనివారం నాడు దాదాపుగా మూడు గంటలకుపైగా సమావేశమయ్యారు. మంత్రి అఖిలప్రియ తనను కలుపుకుపోవడం లేదని ఆయన నిరసనగళం విన్పించారు.

దీంతో చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లా నాయకులతో శనివారం నాడు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ప్రధానంగా నంద్యాల నియోజకవర్గంపైనే చర్చించారు.

మంత్రి అఖిలప్రియ, టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న విబేధాలపై చర్చించారు. ఏవీ సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియతో బాబు వేర్వేరుగా చర్చించారు. పార్టీ అవసరాల రీత్యా కలిసి పనిచేయాలని బాబు వారికి సూచించారు.

av subba reddy

అఖిలప్రియ కూతురులాంటిది కలుపుకొని పోవాలని సూచించారు. ఏవీ సుబ్బారెడ్డి కూడ సానుకూలంగానే స్పందించారు. కలిసి పనిచేయాలని బాబు ఇద్దరికి సూచించారు. ఉప ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నందున

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియ, నంద్యాల నేత ఏవీ సుబ్బారెడ్డి మద్య రాజీ కుదిర్చారు. కర్నూల్ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేరును దాదాపుగా ఖరారు చేశారు. నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక కోసం మంత్రులు కాలువ శ్రీనివాసులు, నారాయణలను ఇంచార్జీలుగా నియమిస్తూ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.

అఖిలప్రియ కూతురులాంటింది

అఖిలప్రియ తన కూతురు లాంటిందని టిడిపి నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. కలిసి పనిచేస్తే నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిదే విజయమన్నారు. భూమా నాగిరెడ్డి బతికున్నకాలంలోనే నంద్యాల అభివృద్ది కోసం పనిచేశారని చెప్పారు. తనకు మంత్రి అఖిలప్రియకు ఎలాంటి విబేధాలు లేవన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థిని ఇంకా నిర్ధారించలేదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
No differences between minister Akhila Priya and me said Tdp leader AV subba Reddy.She is like my daughter he said.Kurnool tdp leaders met Chandrababu naidu on Saturday at Amaravati.
Please Wait while comments are loading...