వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబాయ్‌తో విభేదాల్లేవ్, అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చాను: రామ్మోహన్ నాయుడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP Unsure About Govt's Assurance On AP Bifurcation Act

శ్రీకాకుళం:బాబాయ్ ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడితో తనకు ఎలాంటి విభేధాలు లేవని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. తమ మధ్య అగాధం ఉందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

మాజీ కేంద్ర మంత్రి, శ్రీకాకుళం మాజీ ఎంపీ కింజారపు ఎర్రన్నాయుడు ఆకస్మాత్తుగా మరణించడంతో రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు వచ్చాయని రామ్మోహన్ నాయుడు గుర్తుకు చేసుకొన్నారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్మోహన్ నాయుడు ఎంపీగా తన అనుభవాలను, జిల్లా అభివృద్దికి తాను చేస్తున్న కృషిని వివరించారు. రానున్న రోజుల్లో కూడ శ్రీకాకుళం జిల్లా అభివృద్దికి కృషి చేయనున్నట్టు చెప్పారు.

బాబాయ్‌తో విభేదాలు లేవు

బాబాయ్‌తో విభేదాలు లేవు

బాబాయ్ ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడితో తనకు ఎలాంటి విభేదాలు లేవని శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. జిల్లాలో ఈ రకమైన ప్రచారం జరగడం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు కూడ లేవన్నారు. బాబాయ్ తనను రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నారని కింజారపు రామ్మోహన్ నాయుడు గుర్తు చేసుకొన్నారు. పార్టీ అవసరాల రీత్యా ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకొంటామన్నారు. కొన్ని సమయాల్లో సీఎం చంద్రబాబునాయుడితో చర్చించి నిర్ణయాలు తీసుకొన్నట్టు కూడ రామ్మోహన్ నాయుడు చెప్పారు.

గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడెవరు? గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడెవరు?

అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చా

అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చా

అయిష్టంగానే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పారు.రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోవడంతో రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. నాన్న చనిపోవడంతో షాక్‌కు గురయ్యాయని చెప్పారు. నాన్న స్నేహితులు, అభిమానులు తమ కుటుంబం తీసుకొనే నిర్ణయానికి మద్దతిస్తామని ఆనాడు చెప్పారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేసుకొన్నారు. అయితే ఆ సమయంలో కుటుంబమంతా చర్చించి నిర్ణయం తీసుకోవడంతో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకొన్నట్టు రామ్మోహన్ నాయుడు చెప్పారు.

టార్గెట్ 2019: కర్నూల్ జిల్లాలో త్వరలో జనసేనాని టూర్, పవన్ ప్లాన్ ఇదే టార్గెట్ 2019: కర్నూల్ జిల్లాలో త్వరలో జనసేనాని టూర్, పవన్ ప్లాన్ ఇదే

నాన్న లోటు తీర్చలేనిది

నాన్న లోటు తీర్చలేనిది

రాజకీయాల్లో ఉన్నందున నాన్న ఇంట్లో తక్కువగా ఉండేవారని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గుర్తుచేసుకొన్నారు. చిన్నప్పటి నుండి ఈ విషయాలను దగ్గర నుండి చూసి రాజకీయాలు వద్దనుకొన్నానని చెప్పారు. తన అవసరాల గురించి అమ్మతోనే చర్చించేవాడిననని చెప్పారు. పెద్దాయ్యాక రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించానని ఆయన గుర్తు చేసుకొన్నారు. కానీ, అనివార్యంగా రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. నాన్నలేని లోటును తీర్చలేనిదని రామ్మోహన్ నాయుడు చెప్పారు.నాన్న చూపిన బాటలోనే తాను పయనించేందుకు ప్రయత్నం చేస్తున్నానని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

ఉద్దానం గురించి మాట్లాడాను

ఉద్దానం గురించి మాట్లాడాను

ఉద్దానం బాధితుల గురించి తన తొలి పార్లమెంట్ సమావేశంలోనే మాట్లాడానని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గుర్తు చేసుకొన్నారు. దీనికి సంబంధించి కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డాను కలిసి వినతి పత్రం సమర్పించినట్టు రామ్మోహన్ నాయుడు చెప్పారు. పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటన తర్వాత ఈ విషయమై మరింత ఫోకస్ పెరిగిందన్నారు. కానీ, అంతకుముందు నుండే తాను ఈ విషయమై తన వంతు ప్రయత్నాలను చేశానని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

English summary
Srikakulam MP Kinjarapu Rammohan Naidu said that in the coming days, the people of the district will be able to get many jobs as a lot of projects are coming up in the district. In an interview with a media channel,Srikakulam MP Kinsarappa Rammohan Naidu said he has no differences with Achchanaidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X