మాట నిలబెట్టుకుందాం: కిరణ్, సంతోషం చూశాం: గంటా

No division till 2014, says Kiran
హైదరాబాద్: 2014 ఎన్నికల వరకు ఎట్టి పరిస్థితుల్లోను విభజన జరగనివ్వమని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుందామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారట. సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమయంలో ఆయన మాట్లాడారు.

విభజనను అడ్డుకుంటామని, అసెంబ్లీలో బిల్లును ఓడిస్తామని, వచ్చే ఎన్నికల వరకూ విభజనను జరగనివ్వబోమని ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకుందామని వారితో అన్నారు. విభజన జరగదని, 2014 ఎన్నికల వరకు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని కిరణ్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

నవంబర్ తొలివారం నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో తుఫాన్ బాధితులకు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసినా రాని సంతోషం, సమైక్యాంధ్ర కోసం మాట్లాడినప్పుడు వచ్చిందని ముఖ్యమంత్రితో మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ సందర్భంగా అన్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమం క్షేత్ర స్థాయికి వెళ్లిపోయిందని, దీని ప్రభావం భవిష్యత్తులో రాజకీయాలపై స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సిఎంతో మంత్రులు రఘువీరా రెడ్డి, గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డి తదితరులు భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+