నో ఎండ్: పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా మహేష్ కత్తి గురి

Posted By:
Subscribe to Oneindia Telugu
Pawan Kalyan Tour : Mahesh Kathi Post Against Pawan Kalyan Going Viral | Oneindia Telugu

హైదరాబాద్: సినీ క్రిటిక్ మహేష్ కత్తికి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య సాగుతున్న పోరుకు అంతం లేనట్లే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ చెప్పినప్పటికీ అభిమానులు వినడం లేదు.

మహేష్ కత్తి ఆయన్నూ వదల్లేదు: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై మళ్లీ...

మహేష్ కత్తి వ్యాఖ్యలకు వారు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. వారి వ్యాఖ్యలే మహేష్ కత్తికి ఆయుధాలుగా మారుతున్నాయి.

 తాజా వార్ ఏమిటంటే..

తాజా వార్ ఏమిటంటే..

కత్తి మహేశ్ ఓ రెస్టారెంట్‌లో బీర్ సేవిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను షేర్ చేస్తు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అది మరింతగా వివాదాన్ని సృష్టిస్తోంది. ఈ పని చేస్తోంది పవన్ కల్యాణ్ అనే నిర్ణయానికి కత్తి మహేష్ వచ్చారు.దాంతో పవన్ అభిమానులకు గురి పెట్టి ఓ ట్వీట్ చేశాడు.

 మహేష్ కత్తి ట్వీట్ ఇదీ..

మహేష్ కత్తి ట్వీట్ ఇదీ..

తనకు కూడా తెలియకుండా తాను బీర్ తాగి ఈ దేశానికి క్రిమినల్‌గా ఎలా మారానో తెలియడం లేదని మహేష్ కత్తి అన్నారు. దాని ద్వారా పవన్ వ్యక్తిగత జీవితంపైనా కామెంట్ చేయడానికి పవన్ అభిమానులు తనకు లైసెన్స్ ఇచ్చారని కూడా అన్నారు.

 ఇప్పటి వరకు మహేష్ కత్తి ఇలాగే...

ఇప్పటి వరకు మహేష్ కత్తి ఇలాగే...

ఇప్పటి వరకు మహేష్ కత్తి పవన్ కల్యాణ్ సినిమాలపై, రాజకీయాలపై మాత్రమే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇకపై ఆయన పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా లక్ష్యం చేసుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మహేష్ కత్తి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తే బోలెండ ప్రచారం జరుగుతుంది. పవన్ కల్యాణ్‌పై ఏ చిన్న కామెంటైనా వైరల్ అవుతోంది. ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తే వివాదం తారాస్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది.

తన పొట్ట, బట్టపై మహేష్ కత్తి

తన పొట్ట, బట్టపై మహేష్ కత్తి

పొట్ట,బట్ట అంటూ తన దేహంపై, వస్త్రధారణపై వచ్చిన వ్యాఖ్యలపై మహేష్ కత్తి ఇటీవల ఘాటుగా స్పందించారు. తన రాతల గురించి మాట్లాడాలి గానీ తన పర్సనాలిటీ గురించి ఎందుకని అడిగారు. ఇప్పుడు తాను బీర్ సేవిస్తున్నట్లు తన వ్యక్తిత్వంపై వీడియో వైరల్ అవుతుంటే ఆయన రెచ్చిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

జోరు మీదున్న పవన్ కల్యాణ్

జోరు మీదున్న పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో జోరు పెంచుతున్నారు. ఫాతిమా విద్యార్థుల సమస్యపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై మహేష్ కత్తి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని, పవన్ కల్యాణ్‌ను కలిపి మహేష్ కత్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిని ఆయన తోడు దొంగలుగా అభివర్ణించారు.

 కాటమరాయుడి రివ్యూతో మొదలు..

కాటమరాయుడి రివ్యూతో మొదలు..

జనసేన సిద్ధాంతాలపై కూడా మహేష్ కత్తి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.కాటమరాయుడు సినిమా సమీక్షతో వివాదం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆయనకూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించాడు. దానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫోన్లు చేసి బెదిరించారు కూడా. తీవ్రంగా ఆయనకు హెచ్చరికలు చేశారు.

 ఆ వీడియో కూడా వైరల్

ఆ వీడియో కూడా వైరల్

పవన్‌ కల్యాణ్పై కత్తి మహేష్ వ్యాఖ్యలకు కొన్ని ఫన్నీ సీన్స్ యాడ్ చేసి పవన్ ఫ్యాన్స్ రూపొందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక జబర్దస్త్ షోలో హైపర్ ఆది వ్యాఖ్యలు కూడా వివాదాన్ని పెంచాయి. స్కిట్‌లో భాగంగా వివాహమనేది సినిమా తీసినంత కష్టమని, కానీ ప్రేమ మాత్రం ముందు పొట్ట, వెనక బట్ట వేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ అని డైలాగ్ కొట్టాడు. హైపర్ ఆది పవన్ అభిమాని కావడంతో తనపై కావాలనే డైలాగ్ కొట్టాడని మహేష్ కత్తి భావించి ఆదికి కౌంటర్‌గా వీడియో పోస్ట్ చేశాడు.

మహష్ కత్తి పోస్టు ఇలా..

మహష్ కత్తి పోస్టు ఇలా..

మనుషులు ఒక్కొకక్కరు ఒక్కో మాదిరిగా ఉంటారని, సంస్కారం ఉండేవాళ్లు ఇలా మాట్లాడరని మహేష్ కత్తి ఓ వీడియో పోస్ట్ చేశాడు. హైపర్ ఆది వ్యాఖ్యలపై కూడా కత్తి మహేష్ పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం వివాదంగా మారింది. తన అభిమానులు చేస్తున్న వికృత చేష్టలను పవన్ కల్యాణ్ ప్రోత్సహిస్తున్నారని మహేష్ కత్తి అన్నారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేయడం పెద్ద విషయం కాదు.. కానీ పవన్ ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It seems there will be no end to the social media war between Mahesh Kathi and Jana Sena chief Pawan Kalyan's fans.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి