Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుంజేపల్లి రామాలయంలోకి దళితులకు నో ఎంట్రీ.. అగ్రవర్ణాలతో ఘర్షణ; అనవసర రాద్ధాంతమన్న ఎమ్మెల్యే పద్మావతి

గుంజేపల్లిలో శ్రీరాములవారి ఆలయ ప్రవేశంపై దళితులు, అగ్రవర్ణాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారింది. అనంతపురం జిల్లాలోని నార్పల మండలం గుంజేపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం దళిత గ్రామస్తులను కొందరు అగ్రవర్ణాలకు చెందిన మహిళలు రామాలయంలోకి ప్రవేశం నిరాకరించడంతో వారు అగ్రవర్ణాల గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గుంజేపల్లి గ్రామంలోఉద్రిక్తత నెలకొంది. రెవిన్యూ శాఖ అధికారులతో పాటు పోలీసు సిబ్బంది రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎమ్మెల్యే కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.

రామాలయంలోకి దళితులను అనుమతించని అగ్రవర్ణాల వారు.. వాగ్వాదం

రామాలయంలోకి దళితులను అనుమతించని అగ్రవర్ణాల వారు.. వాగ్వాదం

కొంతకాలంగా ఆలయానికి రక్షణ కల్పించాలంటూ ఆలయ అర్చకుల అభ్యర్థన మేరకు అగ్రవర్ణాల వారు దళితులను ఆలయంలోకి అనుమతించవద్దని నిర్ణయించారు. దీంతో అగ్రవర్ణాల గ్రామస్తులు, దళితుల మధ్య ఘర్షణ మొదలైంది. సోమవారం దళితులను ఆలయంలోకి రాకుండా కొందరు మహిళలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రతిష్టంభన తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యు.వెంకట ప్రసాద్ మరియు కొంతమంది రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని సమస్య తీవ్రం కాకుండా అడ్డుకున్నారు.

దేవాలయాల్లోకి రాకుండా ఎవరినీ ఆపే హక్కు లేదన్న పోలీసులు

దేవాలయాల్లోకి రాకుండా ఎవరినీ ఆపే హక్కు లేదన్న పోలీసులు

దేవాలయాల్లోకి ప్రవేశించకుండా ఎవరినీ ఆపే హక్కు ఎవరికీ లేదని పోలీసులు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న విభేదాలను తాము పరిష్కరించామని, గ్రామస్థులు సామరస్యపూర్వకమైన అవగాహనకు వచ్చేలా చేశామని పోలీసులు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే కూడా దళితుల పక్షాన నిలిచి వారి ఆలయ ప్రవేశానికి అధికారులతో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని, సున్నితమైన అంశాన్ని జాగ్రత్తగా పరిష్కరించాలని సూచించారు.

ఘటనపై మండిపడుతున్న దళిత సంఘాలు

ఘటనపై మండిపడుతున్న దళిత సంఘాలు

ఈ ఘటనపై దళిత సంఘాలు మండి పడుతున్నాయి. ఇప్పటికి కూడా దేశంలో దళితులపై చిన్నచూపు కొనసాగుతుందని గుంజేపల్లి ఘటన స్పష్టం చేస్తుందని మండిపడుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో కూడా కులాల పేరుతో వివక్ష కొనసాగుతోందని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక దళితులకు సపోర్టు చేసిన ఎమ్మెల్యే కనబడడం లేదు అంటూ పోస్టర్ వేసిన ఘనత కూడా అగ్రవర్ణాల వారిదే అంటూ పలువురు మండిపడుతున్నారు.

 దళితుల ఆలయ ప్రవేశం పై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారన్న ఎమ్మెల్యే

దళితుల ఆలయ ప్రవేశం పై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారన్న ఎమ్మెల్యే

ఏది ఏమైనా గుంజేపల్లి లో దళితులను ఆలయంలోకి రానివ్వకుండా అగ్రవర్ణాలవారు అడ్డుకున్న ఘటన ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే గుంజేపల్లిలో దళితుల ఆలయ ప్రవేశం పై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. గ్రామంలో సున్నితంగా ఉన్న సమస్యలు కొందరు పక్కదారి పట్టించారని ఆమె మండిపడ్డారు. ఆధునిక కాలంలో కూడా దళితులు ఆలయంలోకి రానివ్వకపోవడం ఏమిటి అంటూ శింగనమల ఎమ్మెల్యే పద్మావతి విరుచుకుపడ్డారు.

కొందరు కులాల పేరుతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం

కొందరు కులాల పేరుతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం

రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని తాము సూచించామని అధికారులు చట్టప్రకారం ఏది ఉంటే అదే చేశారని కొందరు కులాల పేరుతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. హిందూ ధర్మంలో ఎక్కడా కులాల ప్రస్తావనే లేదని తెలిపిన ఆమె ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. తనపై పోస్టర్ వెయ్యటం కూడా కులాల రాజకీయాల్లో భాగమని వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+