వైస్రాయి ఘటన ఎంతో బాధించింది, నమ్మినవారే ముంచారు: రేణుకా చౌదరి

అమరావతి: ఎన్టీఆర్‌ను వైస్రాయ్ హోటల్ వద్ద అవమానించిన ఘటన తన జీవితంలో చాల ఆవేదనకు గురిచేసిందని ఎంపీ , కాంగ్రెస్ పార్టీ నేత రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని ఆమె చెప్పారు, తాను ఆ సమయంలో హైద్రాబాద్‌లో ఉంటే పరిస్థితి అంతవరకు వచ్చేలా చూసేదాణ్ణి కాదని రేణుకా చౌదరి చెప్పారు.

ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి పలు విషయాలపై మాట్లాడారు. ఆనాడు రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయాలు, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందనే విషయాలను రేణుకా చౌదరి ప్రస్తావించారు.తొలుత టిడిపిలో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు,

ఎన్టీఆర్ అంటే తనకు అమితమైన అభిమానమని ఆమె గుర్తు చేసుకొన్నారు. వైస్రాయి ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకొని తాను ఓ నాయకుడికి ఫోన్ చేసినట్టు రేణుకా చౌదరి ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

ఆ ఘటనతో బాధపడ్డా

ఆ ఘటనతో బాధపడ్డా

టిడిపి సంక్షోభం సమయంలో వైస్రాయి హోటల్ వద్ద ఎన్టీఆర్‌ను అవమానించిన ఘటన తెలుసుకొని చాలా బాధపడ్డానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి గుర్తు చేసుకొన్నారు. వైస్రాయి హోటల ఘటన జరిగిన సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని రేణుకా చౌదరి గుర్తుచేసుకొన్నారు. తాను ఆ సమయంలో ఢిల్లీలో కాకుండా హైద్రాబాద్‌లో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఓ నాయకుడికి ఫోన్ చేసినట్టు రేణుకా చౌదరి గుర్తు చేసుకొన్నారు.

తప్పుల మీద తప్పులు

తప్పుల మీద తప్పులు

టిడిపి సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ తప్పుల మీద తప్పులు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి అభిప్రాయపడ్డారు. మరో వైపు అదే సమయంలోఎక్కువ కాలం పార్టీ ఎన్టీఆర్ చేతుల్లో ఉండదని తాను అనుకొన్నానని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎన్టీఆర్ అల్లుళ్ళు కూడ పార్టీలో పెత్తనం ఎక్కువైందన్నారు. ఈ కారణంగానే పార్టీ సంక్షోభంలో కూరుకుపోతోందని భావించానని రేణుకా చౌదరి గుర్తు చేసుకొన్నారు.

Recommended Video

    Renuka Chowdhury arrest @ Telangana Assembly : Chalo Assembly Protest | Oneindia Telugu
    నమ్మిన వారే మోసం చేశారు

    నమ్మిన వారే మోసం చేశారు

    ఎన్టీఆర్‌ను నమ్మిన వారే మోసం చేశారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చెప్పారు. తనతో నిత్యం ఉన్నవారే ఎన్టీఆర్‌ను నమ్మించి మోసం చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతలా మోసం చేస్తారని ఎన్టీఆర్ ఊహించలేదని రేణుకా చౌదరి చెప్పారు.

    తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లిలో విన్పించారు

    తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లిలో విన్పించారు

    తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ డిల్లీలో విన్పించారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గుర్తు చేసుకొన్నారు.అంతకుముందు తెలుగువారిని మద్రాసీలుగా భావించేవారని చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాకే తెలుగోడంటే ఢిల్లీలో తెలిసిందన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు ఎన్టీఆర్ కృషి చేసిన విషయాన్ని రేణుకా చౌదరి గుర్తు చేసుకొన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+