జగన్‍కు నిరాశే: వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదన్న సీబీఐ కోర్టు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో నిరాశే ఎదురైంది.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో నిరాశే ఎదురైంది. నవంబర్ 2 నుంచి ఆరు నెలలపాటు పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని జగన్ తరపు న్యాయవాది పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్‌పై సోమవారం విచారించిన సీబీఐ కోర్టు.. జగన్ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. కాగా, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినాహాయింపు ఇవ్వవద్దని సీబీఐ వాదించింది.
కేసు విచారణలో ఉండగా ప్రధాన నిందితుడికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించాలని జగన్ తరపు న్యాయవాదులు నిర్ణయించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications