లోకేష్‌కు పదవి తొందర అనేనా: లేని జూ.ఎన్టీఆర్ ఫోటో, పవన్ కూడా..

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు మూడు రోజుల పాటు ఉత్సాహంగా సాగింది. బుధవారం నాడు ప్రారంభమై, శుక్రవారం నాడు ముగిసింది. మహానాడులో యువనేత నారా లోకేష్ హంగామా కనిపించింది. అయితే, అందరూ భావించినట్లుగా ఆయనకు పార్టీలో ముఖ్య పదవి కట్టబెట్టలేదు.

నారా లోకేష్‌కు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడతారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అలాంటి ముఖ్య పదవి ఏదీ కట్టబెట్టలేదు. అయితే, ఆయన హడావుడి మాత్రం కనిపించింది. ఇప్పుడే పదవి కట్టబెడితే తొందరపాటు అవుతుందని భావించి ఉంటారని అంటున్నారు.

మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. గవర్నర్ సమక్షంలో చంద్రబాబు - కేసీఆర్ కలిసిన ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మహానాడులో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు కనిపించలేదు. లోకేష్‌కు అధిక ప్రాధాన్యమిచ్చారు.

 No Jr NTR photo in Mahanadu

సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుల తర్వాత లోకేష్ ఫోటోలే ఎక్కువగా కనిపించాయి. ఫోటో ఎగ్జిబిషన్ కోసం రెండు స్టాళ్లు ఏర్పాటు చేశారు. అందులో ఓ స్టాల్లో ఓ వైపు మొత్తం లోకేష్‌కు చెందిన ఫోటోలు ఉన్నాయి.

జూ ఎన్టీఆర్ ఫోటో మాత్రం కనబడలేదు. హరికృష్ణకూ పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న కొన్ని ఫోటోల్లో మాత్రం హరికృష్ణ కనిపించారు.

మరోవైపు, మహానాడుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన మాత్రం హాజరు కాలేదు. అదే సమయంలో ఆయన గబ్బర్ సింగ్ షూటింగ్ కోసం వెళ్లినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మహానాడు టీడీపీకి కొత్త ఊపు తెచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+