ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ కాదా ? బీజేపీని వాడుకుని ఎన్టీఆర్ ఫ్యామిలీ హైజాక్ !

ఏపీలో ఎన్టీఆర్ వారసులెవరు ? ఆయనకు వెన్నుపోటు పొడిచారని చెబుతున్న అల్లుడు చంద్రబాబు, ఆయనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులా ? లేక ఆయనతో తుది కంటా ఉన్న లక్ష్మీపార్వతా అన్న చర్చకు దాదాపు తెరపడే సమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతికి కాస్తో కూస్తో గుర్తింపు దక్కినా తాజాగా ఆయన శతజయంతి కార్యక్రమాలతో పాటు కేంద్రం నిర్వహించిన స్మారక నాణెం విడుదల కార్యక్రమానికీ ఆమెకు ఆహ్వానం దక్కలేదు. దీంతో ఎన్టీఆర్ కుటుంబం దశాబ్దాలుగా సాగుతున్న పోరులో లక్ష్మీపార్వతిని విజయవంతంగా వెనక్కి నెట్టేసినట్లయింది.

ఎన్టీఆర్ మరణానికి ముందే ఆయన కుటుంబ సభ్యుల్ని వదిలేసి లక్ష్మీపార్వతి దగ్గరికి వెళ్లిపోయారు. ఇది తట్టుకోలేక ఆయన కుటుంబం ఎన్టీఆర్ నుంచి అధికారం లాగేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వీరికే మద్దతివ్వడంతో ఎన్టీఆర్ ఒంటరయ్యారు. చివరకు ఆత్మక్షోభతోనే చనిపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్ వారసత్వం గురించిన చర్చ వచ్చినప్పుడల్లా తాను ఉన్నానంటూ ముందుకొచ్చిన లక్ష్మీపార్వతిని రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోలేదు. కానీ ఏపీ విభజన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమెను పార్టీలోకి తీసుకోవడంతో పాటు ఎన్టీఆర్ అభిమానుల మద్దతు పొందే ప్రయత్నం చేసింది.

no more lakhmis ntr from here? late cms family successfully hijacks his legacy through bjp

కానీ ఎన్టీఆర్ వారసత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే లక్ష్యంతో బీజేపీ అప్పటికే పార్టీలో ఉన్న ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ అధ్యక్షురాలిగా ప్రకటించింది. దీంతో సగం సమీకరణాలు మారిపోయాయి. తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబానికి ఆహ్వానం పంపి, లక్ష్మీపార్వతిని పక్కనబెట్టేశారో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశం కూడా స్పష్టమైంది. ఇది అర్ధం చేసుకునే వైసీపీ సైలెంట్ గా ఉండిపోయింది. ఇంకా చెప్పాలంటే దీనికి కారణమైన పురందేశ్వరిని వదిలిపెట్టి చంద్రబాబును టార్గెట్ చేసింది.

ఇన్నాళ్లూ ఎన్టీఆర్ వారసురాలు లక్ష్మీపార్వతే అనుకుంటున్న కొందరికి ఇప్పుడు తాజా పరిణామాలతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రేపు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించినా దాన్ని ఆయన కుటుంబమే తీసుకుంటుందే తప్ప లక్ష్మీపార్వతిని ఆహ్వానించే అవకాశాలు లేవు. దీంతో ఇకపై ఆమె లక్ష్మీస్ ఎన్టీఆర్ కాదని తేలిపోతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కుటుంబం బీజేపీ సాయంతో గతంలో తాము పొగొట్టుకున్న దాన్ని తిరిగి పొందినట్లు అర్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+