వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు - పొన్నవోలు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో నేడు విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ. అలాగే, ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే. అలానే సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అయితే, పోలీసుల అదుపులో ఉన్న సత్య వర్ధన్.. ఎవరు దాడి చేశారు..? ఎక్కడ దాడి చేశాడు..? అనేది చెబుతారు అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.. ఇక ఈ కేసు విచారణ తర్వాత వంశీ కేసులో వాదనలు వినిపించిన మాజీ AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించామన్నారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. వంశీని జైలులో హింసాత్మక వాతావరణంలో ఉంచారన్న ఆయన.. వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని.. వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు. సీన్ రీ కనస్ట్రక్ట్ కోసం సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి.. వంశీ అవసరం లేదన్నారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అరెస్టు సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన అని గుర్తు చేశారు.
కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పటంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉందని పొన్నవోలు పేర్కొన్నారు. కేసు వెనక్కి తీసుకొంటూ సత్యవర్ధన్ స్టేట్ మెంట్ ఇస్తే.. అతనిపై కూడా ఈ నెల 11న కేసు నమోదు చేశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. మరోవైపు వంశీని 10 రోజుల కస్టడీకి కోరుతూ పటమట పోలీసుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications