'బాబుకు ముచ్చెమటలే, నంద్యాలలో జగన్‌ను ఓడించేవారులేరు': సభకు చక్రపాణి రెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌కు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వచ్చారు. నంద్యాల రహదారులు జనంతో నిండిపోయాయి. పెద్ద ఎత్తున జనాలు హ

నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్‌కు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వచ్చారు. నంద్యాల రహదారులు జనంతో నిండిపోయాయి. పెద్ద ఎత్తున జనాలు హాజరయ్యారు.

చంద్రబాబుకు ముచ్చెమటలే

చంద్రబాబుకు ముచ్చెమటలే

బహిరంగ సభ సందర్భంగా పలువురు మాట్లాడారు. నంద్యాల వైయస్ జగన్ కంచుకోట అని, ఇక్కడ భూమా కుటుంబాన్ని ఓడిస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తామని వ్యాఖ్యానించారు.

Recommended Video

    YSRCP To Win AP in 2019 : Survey Reports
    అయినా టిడిపి గెలవదు

    అయినా టిడిపి గెలవదు

    వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. జగన్ సీఎం కావాలని అందరు కోరుకుంటున్నారన్నారు. అలాగే చంద్రబాబు దిగిపోవాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఓటు వేస్తే చంద్రబాబు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇస్తామన్నారని ఆరోపించారు. అయినప్పటికీ టిడిపి గెలవదన్నారు.

    జగన్‌ను ఓడించేవారు లేరు

    జగన్‌ను ఓడించేవారు లేరు

    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కచ్చితంగా గెలుస్తారన్నారు. నంద్యాల వైసిపి కంచుకోట అని, అందుకే గెలుస్తారని చెబుతున్నామన్నారు. కడప, కర్నూలులో జగన్‌ను ఓడించే వారు లేరన్నారు. చంద్రబాబు పాలన దుర్మార్గమన్నారు.

    హోరెత్తిన జగన్ నినాదాలు

    హోరెత్తిన జగన్ నినాదాలు

    ఎస్పీజీ మైదానానికి జగన్ రాగానే సభా ప్రాంగణం అంతా జై జగన్ నినాదాలతో హోరెత్తింది. ఆయనకు నేతలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

    సస్పెన్స్‌కు తెర.. సభకు చక్రపాణి రెడ్డి

    సస్పెన్స్‌కు తెర.. సభకు చక్రపాణి రెడ్డి

    వైసిపి నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరడంపై చివరి నిమిషంలో సస్పెన్స్ కొనసాగింది. అయితే, ఆయన బహిరంగ సభకు హాజరయ్యారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ కాన్వాయ్‌తో పాటే చక్రపాణి వచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+