దినేష్ రెడ్డికి నిరాశ: వద్దన్న ప్రభుత్వం, మళ్లీ పిటిషన్
హైదరాబాద్: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) దినేష్ రెడ్డికి క్యాట్‌లో గురవారం నిరాశ ఎదురయింది. తన పదవీ కాన్ని పొడిగించాలని దినేష్ రెడ్డి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది. డిజిపి పిటిషన్ పైన క్యాట్‌లో విచారణ ముగిసింది.
తన పదవీ కాలాన్ని పొడిగించాలని డిజిపి చేసిన అభ్యర్థనను క్యాట్ తోసిపుచ్చింది. డిజిపిపై సిబిఐ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పొడిగింపు అవసరం లేదని ప్రభుత్వం క్యాట్‌కు నివేదిక ఇచ్చింది. దీంతో క్యాట్ దినేష్ రెడ్డి చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే దినేష్ రెడ్డి మళ్లీ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం నిరాకరించడంతో ఆయన ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేశారు.

కాగా, దినేష్ రెడ్డి ఆస్తుల పైన సిబిఐ విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. తన ఆస్తులపై సిబిఐ విచారణ దర్యాఫ్తుపై దినేష్ రెడ్డి వారం రోజుల క్రితం స్పందించారు. సిబిఐ విచారణలో అన్ని అంశాలు బయటపడతాయన్నారు. తాను డిజిపి కావడానికి ముందే తనపై పలువురు హోంశాఖకు ఫిర్యాదులు పంపారని, అందులో ఫిర్యాదుదారు పేరు లేకపోవడంతో వాటిని పక్కన పెట్టారన్నారు.
ఓ పార్లమెంటు సభ్యుడి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి తనపై ఫిర్యాదు చేశారని చెప్పారు. తనకు డిజిపి పదవి రాకుండా చేసేందుకు పలు పిటిషన్లు వేశారని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది. దినేష్ రెడ్డి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. తదుపరి అవకాశం ప్రసాద రావుకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications