అప్పుల ఊబిలో చిక్కుకున్నారా? ఈ 5 చిట్కాలతో బయటపడండి!

ఎవరికైనా అనేక రుణాలు లేదా లోన్లు ఉండటం ప్రారంభంలో సాధారణంగానే అనిపించవచ్చు. కానీ ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐలు క్రెడిట్ కార్డ్ బాకీలు, వాటిపై పడే అధిక వడ్డీ క్రమంగా ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. అయితే కొన్ని తెలివైన చిట్కాలను పాటించడం ద్వారా అప్పులను నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా క్రెడిట్ స్కోరును కాపాడుకుంటూ ఆర్థిక భద్రతను సాధించవచ్చు.

పిల్లల కోసం SBI నుంచి కొత్త పథకం.. 5 ఏళ్లు కడితే చాలు.. రూ.45 లక్షలు!
పిల్లల కోసం SBI నుంచి కొత్త పథకం.. 5 ఏళ్లు కడితే చాలు.. రూ.45 లక్షలు!

ఆదాయం-అప్పుల నిష్పత్తిని లెక్కించుకోవడం
ముందుగా మీ వద్ద ఉన్న అన్ని లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల కనీస చెల్లింపులను లెక్కించండి. మీ మొత్తం నెలవారీ అప్పుల చెల్లింపులు మీ నికర నెలవారీ ఆదాయంలో 40 నుంచి 50 శాతానికి మించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ రుణ చెల్లింపులు మీ పరిమితిని దాటితే.. పరిస్థితి చేయి దాటిపోక ముందే వెంటనే సరిదిద్దే చర్యలు ప్రారంభించాలి.

Smart Tips to Manage Multiple Loans Learn 5 smart financial tips to control debt boost your credit score

అధిక వడ్డీ రుణాలకు మొదటి ప్రాధాన్యత
రుణాలన్నింట్లోకెల్లా అధిక వడ్డీ రేటు ఉన్న వాటిని ముందుగా తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వండి. హోమ్ లోన్లు లేదా ఎడ్యుకేషన్ లోన్లతో పోలిస్తే క్రెడిట్ కార్డ్ బాకీలు, పర్సనల్ లోన్లపై వడ్డీ భారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ వద్ద అదనంగా డబ్బులు ఉన్నప్పుడు అధిక వడ్డీ ఉన్న రుణాలను త్వరగా చెల్లించడం వల్ల వడ్డీ భారం తగ్గి త్వరిత ఉపశమనం లభిస్తుంది.

క్రెడిట్ కార్డ్ బాకీలు
క్రెడిట్ కార్డులో కేవలం మినిమం డ్యూ మాత్రమే చెల్లించడం వల్ల పెనాల్టీలు పడవు కానీ వడ్డీ మాత్రం చక్రవడ్డీలా పెరుగుతూనే ఉంటుంది. కావున ఎల్లప్పుడూ కనీస మొత్తం కంటే ఎక్కువ చెల్లించేందుకు ప్రయత్నించండి. అలాగే మీకు వేర్వేరు బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ ఉన్న లోన్లు ఉంటే వాటన్నింటినీ తక్కువ వడ్డీకి లభించే ఓ పెద్ద లోన్ గా(డెట్ కన్సాలిడేషన్) మార్చుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గి, చెల్లింపులు సులువవుతాయి.

Indus Waters Treaty: సింధు జలాలపై అంతర్జాతీయ కోర్టు తీర్పు..! భారత్ కీలక నిర్ణయం..!
Indus Waters Treaty: సింధు జలాలపై అంతర్జాతీయ కోర్టు తీర్పు..! భారత్ కీలక నిర్ణయం..!

ఆటో డెబిట్, సమయానికి చెల్లింపులు
ఒక్క ఈఎంఐ చెల్లింపు మిస్ అయినా మీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే నిర్ణీత తేదీ నాటికి బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకుని ఆటో-డెబిట్ ఆప్షన్ సెట్ చేసుకోండి. క్రమం తప్పకుండా ప్రతి నెల సమయానికి వాయిదాలు చెల్లించడం వల్ల మీ క్రెడిట్ రికార్డ్ బలంగా తయారవుతుంది.

అత్యవసర నిధి ఏర్పాటు
అనుకోకుండా వచ్చే అత్యవసర పరిస్థితుల్లో మళ్లీ కొత్తగా అప్పులు చేయకుండా ఉండటానికి అత్యవసర నిధి ఎంతగానో తోడ్పడుతుంది. కనీసం మూడు నుంచి ఆరు నెలల ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బును వేరుగా దాచి ఉంచాలి. అకస్మాత్తుగా వైద్య ఖర్చులు రావడం లేదా ఉద్యోగంలో అంతరాయం కలగడం వంటి సమయాల్లో ఈ నిధి మీకు రక్షణగా నిలిచి మళ్లీ అప్పుల పాలు కాకుండా రక్షిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+