టిలో సీమాంధ్రుల భద్రతపై వెంకయ్య, పోలవరంతో స్టార్ట్

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం అన్నారు. విజయవాడ, విశాఖపట్నంలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఐఐటీ, ఐఐఎం సంస్థలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో సీమాంధ్రుల భద్రతకు ఎలాంటి భయం అవసరం లేదన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు.

No witch hunt against opponents: Venkaiah

తనకు పదవుల కంటే పార్టీకి సేవ చేయడమే ఇష్టమన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌తో సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయడం ప్రారంభించామన్నారు. తమకు వచ్చినవి కాంగ్రెసు పార్టీ వ్యతిరేక ఓట్లు కావని చెప్పారు. మోడీ నాయకత్వం నచ్చి ప్రజలు తమకు ఓటేశారన్నారు.

తెలంగాణ, సీమాంధ్రల్లో బిజెపికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం రెండు ప్రాంతాలకు న్యాయం చేస్తుందని, మోడీ నాయకత్వంలో భారత్ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందన్నారు. మరోవైపు తాము ఎవరి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడమని వెంకయ్య నాయుడు చెప్పారు. ఎవరి పైన అయినా చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+