2009లో కోడ్ ఉల్లంఘన: మంత్రి గంటా శ్రీనివాస రావుకు షాక్
ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు గట్టి షాక్ తగిలింది. ఆయనకు బుధవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
అమరావతి: ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు గట్టి షాక్ తగిలింది. ఆయనకు బుధవారం నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్ కోర్డు జడ్జి ఆయనకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేశారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా, నంద్యాల ఉప ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 35 శాతం పోలింగ్ నమోదు కాగా మధ్యాహ్నం 3 గంటల సమయానికి 71.91 శాతం పోలింగ్ నమోదయింది.












Click it and Unblock the Notifications