కోహినూర్ వజ్రాకృతిలో అసెంబ్లీ: డిజైన్లలో బాబు కీలక మార్పులు, హైకోర్టు ఇలా..
నవ్యాంధ్ర అసెంబ్లీ నిర్మాణ డిజైన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిర్ణయించారు. హైకోర్టు ఆకృతిని కూడా ఆయన ఓకే చేశారు.
అమరావతి: నవ్యాంధ్ర అసెంబ్లీ నిర్మాణ డిజైన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిర్ణయించారు. హైకోర్టు ఆకృతిని కూడా ఆయన ఓకే చేశారు. అయితే, హైకోర్టు చీఫ్ జస్టిస్ చూపించి తుది డిజైన్ సిద్ధం చేయాలని సూచించారు.
నార్మన్ పోస్టర్ ప్రతినిధులు చూపించిన డిజైన్లను మార్పులు చేసి చంద్రబాబు ఓకే చేశారు. శాసన సభ, హైకోర్టు భవనాల ఆకృతుల్లో కీలక మార్పులు సూచించారు.
శాసన సభ కోసం సిద్ధం చేసిన బుద్ధస్థూపం ఆకృతిని హైకోర్టుకు మార్చాలని, అలాగే హైకోర్టు కోసం సిద్ధం చేసిన వజ్రాకార (డైమండ్) డిజైన్‌ను శాసన సభకు సిద్ధం చేయాలన్నారు.
మార్చిన హైకోర్టు డిజైన్‌ను చీఫ్ జస్టిస్‌కు చూపించి తుది డిజైన్లను సిద్ధం చేయాలని చంద్రబాబు సూచించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. హైకోర్టును 4 అంతస్తులుగా రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, అసెంబ్లీ, సచివాలయం 250 ఎకరాల్లో నిర్మిస్తారు.

కోహినూర్ వజ్రాకృతిలో అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీకి కోహినూర్ వజ్రాకృతిని ఓకే చేశారు. అసెంబ్లీని ఆరు అంతస్తుల్లో 4.5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ నాలుగు భాగాలుగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో అసెంబ్లీ, మండలి, పరిపాలనా చాంబర్లు, పీపుల్స్ ప్లేస్ ఉంటాయి.

అసెంబ్లీలోని పై అంతస్తుల్లో..
అసెంబ్లీలోని మొదటి అంతస్తులో స్పీకర్, మండలి చైర్మన్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, మంత్రుల చాంబర్లు ఉంటాయి. మూడో ఫ్లోర్‌లో లైబ్రరీ, మీటింగ్ హాల్ ఉంటుంది. 4, 5, 6 ఫ్లోర్‌లలో పరిపాలనా వ్యవహారాలు ఉంటాయి.
Recommended Video


హైకోర్టు డిజైన్ ఇలా..
హైకోర్టుకు బుద్ధస్థూపం ఆకృతిని ఓకే చేశారు. హైకోర్టు నాలుగు ఫ్లోర్లుగా, ఆరు లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో రిజిస్ట్రార్లు, ఇతర పాలనా వ్యవహారాలు ఉంటాయి.

హైకోర్టు పై అంతస్తుల్లో..
హైకోర్టు మొదటి అంతస్తులో లైబ్రరీ, మీటింగ్ హాల్, పబ్లిక్ ఫెసిలిటీ హాలు ఉంటాయి. రెండో అంతస్తులో 16 కోర్టులు, ఆయా కోర్టుల జడ్జిలు ఉంటారు. మూడో అంతస్తులో ఇరవై కోర్టులు, జడ్జిల చాంబర్లు, వెయిటింగ్ హాలు ఉంటాయి. నాలుగో అంతస్తులో చీఫ్ జస్టిస్ కోర్టు, చాంబర్లు, జడ్జిల మీటింగ్ హాళ్లు ఉంటాయి.












Click it and Unblock the Notifications