అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం, స్నేహితులతో బోటింగ్‌కు వెళ్లి...
నార్త్ కరోలినా: స్నేహితులతో కలిసి అమెరికాలో సరదాగా బోటింగ్‌కు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా క్యారీలో చోటుచేసుకుంది.
చదవండి: కాలిఫోర్నియాలో దుండగుడి కాల్పులు... నలుగురు మృతి
ఏపీకి చెందిన దేవినేని రాహుల్ (19) తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో నివసిస్తున్నాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్ కు వెళ్లాడు. అయితే ప్రమాదశావత్తు పడవ మునిగిపోవడంతో రాహుల్, అతని స్నేహితుడు నదిలో పడిపోయారు.

ఇది గమనించిన స్థానికులు వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో రాహుల్ మృతి చెందగా, అతని స్నేహితుడు గాయపడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications