నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న చంద్రబాబుకు నోటీసులు; తెలుగు తమ్ముళ్ళు ఫైర్ !!

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఏపీలో వర్షాలు, వరద ధాటికి రాయలసీమ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. ఈ నేపధ్యంలో రాయల సీమ జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. బుధవారం నాడు వరద ప్రభావిత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబుకు పోలీసులు నోటీసు ఇచ్చారు. రాయల చెరువును పరిశీలించటానికి వెళ్ళిన చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు రాయల చెరువు పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్తున్నారు.

చిత్తూరు జిల్లా పర్యటనలో మళ్ళీ తన భార్యకు జరిగిన అవమానంపై ఆవేదనతో చంద్రబాబు.. ఏం చెప్పారంటే!!చిత్తూరు జిల్లా పర్యటనలో మళ్ళీ తన భార్యకు జరిగిన అవమానంపై ఆవేదనతో చంద్రబాబు.. ఏం చెప్పారంటే!!

 రాయల చెరువు రెడ్ జోన్ ... వెళ్లొద్దు అంటూ పోలీసులు

రాయల చెరువు రెడ్ జోన్ ... వెళ్లొద్దు అంటూ పోలీసులు

రాయల చెరువును రెడ్ జోన్ గా ప్రకటించామని చెప్తున్నారు. తాను రాయల చెరువును పరిశీలించి తీరుతానని చంద్రబాబు తేల్చి చెప్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నారు. పరిశీలనకు వస్తే ఎందుకు ఆపుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలచెరువు పరిసర ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లొద్దు అని వైసీపీ ప్రభుత్వం నేతలకు సూచిస్తోంది. రాయల చెరువు కట్ట తెగితే కనీసం వంద గ్రామాలకు ముప్పు ఉంటుందని అధికారులు గతంలో అలర్ట్ కూడా చేశారు. ఇక తాజాగా ప్రమాదం లేదని చెప్తున్నా పరిసర గ్రామాల ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తం అవుతూనే ఉంది.

నోటీసులు జారీ చేసిన పోలీసులు

నోటీసులు జారీ చేసిన పోలీసులు


ఇదిలా ఉంటే వరద ముంపు లో ఇబ్బంది పడుతున్న తమను ఆదుకో లేదని మరోవైపు స్థానికులు వైసిపి నాయకులు పై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు చంద్రబాబు అదే ప్రాంతానికి పర్యటనకు వెళుతున్న క్రమంలో ఆ ప్రాంతంలో పర్యటనలు నిషిద్ధం అని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు టిడిపి జిల్లా అధ్యక్షుడు నానికి కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు. మరి చంద్రబాబు రాయలచెరువు ప్రాంతాన్ని పరిశీలించి తీరుతాం అని తేల్చి చెప్పడంతో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితి ఏ మలుపు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

వందకు పైగా గ్రామాలకు చెరువు కట్టతో ప్రమాదం

ఇదిలా ఉంటే వందకు పైగా గ్రామాలను ,పదివేల మంది ప్రజలను ప్రస్తుతం రాయల చెరువు వ్యవహారం భయాందోళనకు గురిచేస్తుంది. రాయలచెరువు ఈ స్థితికి ఎవరు కారణం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చెరువు దిగువన వందకుపైగా గ్రామాలకు ఈ నీళ్లు ప్రస్తుతం ప్రమాదం కలిగించే స్థాయిలో ఉండటంతో ఆ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చంద్రబాబునాయుడు ఈ గ్రామాల ప్రజలకు భరోసా కల్పించడానికి, రాయలచెరువు ప్రస్తుత పరిస్థితిని పరిశీలించడానికి వెళ్లనున్న క్రమంలో పోలీసులు నోటీసులిచ్చి అడ్డుకోవాలని ప్రయత్నించడం ఆందోళనకు కారణం గా మారుతుంది.

Recommended Video

AP Floods : 25 Lakhs ఇవ్వండి... ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్న Rains || Oneindia Telugu

చిత్తూరు జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు.. జగన్ సర్కార్ పై ఫైర్


ఇదిలా ఉంటే ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు చిత్తూరులో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజల బాధలు తెలుసుకుంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల, వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల గ్రామాలకు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అండగా తాము ఉంటామని వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Police notices to Chandrababu, who is on a tour of flood-affected areas. Notices were served that the Rayala lake was a red zone and did not go there. Tensions erupted when Chandrababu said he would go for examin the situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X