ద్వివేదుల విశాలాక్షి కన్నుమూత: చిన్నయ్య ఇక లేరు

1965లో‘వైకుంఠపాళి' నవలా రచనతో ప్రారంభమైన విశాలాక్షి సాహిత్య ప్రస్థానం 1995లో రాసిన ‘ఎంత దూరమీ పయనం' వరకూ కొనసాగింది. ఆమె మొత్తం 13 నవలలు రాశారు. విశాలాక్షి రచించిన ‘వారధి' నవలను‘రెండు కుటుంబాల కథ' పేరుతో 1969లో సినిమాగా తీశారు. ‘వస్తాడే మా బావ' సినిమాకు ఆమె మాటలు రాశారు. ఆమె కథలు ఎనిమిది సంపుటాలుగా వెలువడ్డాయి.
విశాలాక్షి రచించిన కొన్ని నవలలను కన్నడ, హిందీ భాషలలోకి అనువదించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1982), రాజాలక్ష్మీ ఫౌండేషన్ లిటరరీ అవార్డు (1999) సహా 13 పురస్కారాలను విశాలాక్షి అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆమెకు 1998లో గౌరవ డీలిట్ ప్రదానం చేసింది. నేషనల్ బుక్ ట్రస్ట్(ఢిల్లీ) వారు.. ఆమె ‘వారధి' నవలను 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు.
యెండ్లూరి చిన్నయ్య మృతి
ప్రముఖ సాహితీవేత్త, కవి, అంబేద్కర్ జీవిత చరిత్ర తెలుగు అనువాదకుడు డాక్టర్ యెండ్లూరి చిన్నయ్య (82) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా నరుకూరు గ్రామంలో 1933 మే 2వ తేదీన ఆయన జన్మించారు. విద్యార్థి దశ నుంచే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పోరాటాలు చేశారు.
రైల్వేలో ఉద్యోగానికి మూడు సంవత్సరాలకే రాజీనామా చేసి, స్నేహితులతో కలిసి అంబేద్కర్ మిషన్‌ను ప్రారంభించారు. దాని ద్వారా వివిధ జిల్లాల్లోని మురికివాడల్లో పర్యటించి రాత్రిబడులు నడుపుతూ దళితుల్లో చైతన్యాన్ని నింపారు. మానవహక్కులు, మత విప్లవాలపై భారతీయుల వాణిని వాషింగ్టన్‌లో వినిపించారు.
చిన్నయ్య రిపబ్లిక్‌పార్టీ తరఫునరెండుసార్లు పార్లమెంటుకు పోటీచేశారు. భార్య నాగమణితో కలిసి ఆంధ్ర రిపబ్లికన్, పీపుల్స్ హెరాల్డ్, ప్రజాబంధు పత్రిలకు ఎడిటర్‌గా పనిచేశారు. చిన్నయ్యకు భార్య విజయకుమారి, కుమార్తెలు సుమేధ, సునీత ఉన్నారు. చిన్నయ్య అంత్యక్రియలు బన్సీలాల్‌పేటలోని విద్యుత్ శ్మశానవాటికలో శనివారం నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.












Click it and Unblock the Notifications