బాబు కోసం 25మంది జర్నలిస్టులు: లంచం ఇవ్వడమేనన్న ప్రశాంత్ భూషణ్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగానే 25మంది జర్నలిస్టులకు లంచాలు చెల్లిస్తున్నారని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారికంగానే 25మంది జర్నలిస్టులకు లంచాలు చెల్లిస్తున్నారని పేర్కొంటూ.. దానికి సంబంధించిన జీవోను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ ద్వారా ప్రజల ముందు పెట్టారు.
సాధారణంగానే మీడియా ఫోకస్‌ను ఎక్కువగా కోరుకునే సీఎం చంద్రబాబు.. జాతీయ స్థాయిలో తన ప్రభను గొప్పగా చాటేందుకు ఈ జర్నలిస్టులను నియమించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలో చంద్రబాబుకు అనకూల కథనాలు రాయడం.. వాటికి ప్రచారం కల్పించడం వంటి చర్యలను ఈ జర్నలిస్టులు చూసుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు నియమించుకున్న 25మంది జర్నలిస్టుల టీమ్ కోసం నెలకు రూ.12,86,700 చెల్లిస్తూ ఆర్థిక శాఖ జీవో-24987 విడుదల చేసింది. డిసెంబర్ 7,2016నాడు ఈ జీవో విడుదలైనట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో జర్నలిస్టుకు నెలకు రూ.51,468ను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోను ట్విట్టర్ లో పోస్టు చేసిన ప్రశాంత్ భూషణ్ చంద్రబాబు తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు జర్నలిస్టులకు అధికారికంగా లంచం ఇవ్వడం లాంటివేనని అభిప్రాయపడ్డారు.
Now AP CM officially bribes 25 journos to do his PR & publicly work! pic.twitter.com/f52UQuv80T
— Prashant Bhushan (@pbhushan1) December12, 2016












Click it and Unblock the Notifications