హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో భూ, వివాహ రిజిస్టేషన్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లో

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రిజిస్టేషన్ల వ్వవస్ధను సులభతరం చేస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీలో ఇక ఎక్కడినుంచైనా రిజిస్టేషన్లు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో భూ రిజిస్టేషన్లు, వివాహ రిజిస్టేషన్ల విధానాన్ని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘనాథరెడ్డి గురువారం ప్రారంభించారు.

ఆన్‌లైన్‌లో ముందుగా సమయాన్ని నిర్ణయించుకొని బుకు చేసుకోవడంతో పాటు, అవసరమైన దస్తావేజుల్ని రాసుకోవచ్చు. చెల్లించాల్సిన రుసుమును నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఆస్తులతో పాటు, హిందూ వివాహలకు సంబంధించిన ఉచితి రిజిస్టేషన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Now register property online in Andhra Pradesh

ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ " ప్రజల సౌకర్యార్ధం తీసుకువచ్చిన ఈ విధానం మూలంగా ఆన్‌లైన్‌లోనే రిజిస్టేషన్లకు సంబంధించిన ప్రక్రియ సులభతం అవుతుంది. ప్రజలే దస్తావేజులను తయారు చేసుకనేలా, స్లాట్ బుకింగ్, డేటా ఎంట్రీ లాంటి సౌకర్యాలు కల్పించాం. తమకు నచ్చిన తేదీల్లో రిజిస్టేషన్లను చేయించుకోవచ్చు. దీంతో పాటు ఆన్‌లైన్‌లోనే నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు చెల్లించే ఏర్పాట్లు చేశాం. ఆన్ లైన్ బ్యాంకింగ్ సదుపాయం లేని వారికి డీడీగానీ, చలాన్ ద్వారా గానీ చెల్లింపులు చేసే విధంగా రూపొందించాం" అని అన్నారు.

ఇక మంత్రి పల్లె రఘనాథరెడ్డి మాట్లాడుతూ "ఐటీ పరిజ్ఞానాన్ని ప్రజలు చక్కగా వినియోగించుకుంటున్నారు. రిజిస్టేషన్ల విధానంలో తీసుకొచ్చిన ఈ మార్పు వల్ల మధ్య వర్తుల ప్రమేయం తగ్గతుంది" అని అన్నారు.

ఈ కొత్త విధానం ద్వారా 45 నిమిషాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. హిందూ వివాహ రిజిస్టేషన్‌కు సంబంధించి కూడా ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. దీని వల్ల వినియోగదారులకు సమయం కలిసొస్తుందన్నారు.

English summary
The Andhra Pradesh government on Thursday formally put in place the "anywhere online registration" scheme that enables a property owner or buyer to complete most of the process, including payment of the fee, online. They need to go to the sub-registrar office only for the final act of registration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X