• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పీపీఏలపై జగన్‌కు మరో షాక్‌- ఆ రెండింటి రద్దూ కుదరదన్న ఎన్టీపీసీ- ఇక భరించాల్సిందే...

|

ఏపీలో గత ప్రభుత్వాలు కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం ఇప్పట్లో జగన్ సర్కారును వదిలేలా కనిపించడం లేదు. ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిన విద్యుత్‌ ఒప్పందాల నుంచి వైదొలగేందుకు ప్రభుత్వం సీరియస్‌ గా చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో గ్రీన్‌కో పాటు ఇతర ఒప్పందాలపై హైకోర్టు ఉత్తర్వులతో బ్రేక్‌ పడగా.. తాజాగా తమిళనాడులోని వల్లూరు, కర్నాటకలోని కూడ్గి ప్లాంట్లతో ఒప్పందాలు కూడా అమలు చేయాల్సిందేనని ఎన్టీపీసీ స్పష్టం చేయడం ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బగా మారింది.

వెంటాడుతున్న ఒప్పందాలు...

వెంటాడుతున్న ఒప్పందాలు...

2014 కంటే ముందు విద్యుత్‌ కు డిమాండ్‌ అధికంగా ఉన్న రోజుల్లో ఏపీలోని ప్రభుత్వాలు కూడా మిగతా రాష్ట్రాల్లాగే భారీగా ఖర్చవుతున్నా లెక్క చేయకుండా ఒప్పందాలు చేసుకున్నాయి. 2008లో తమిళనాడులోని వల్లూరు ఎన్టీపీసీ ప్లాంట్‌, అలాగే 2010లో కర్నాటకలోని కూడ్గి విద్యుత్‌ కేంద్రాలతో ఒప్పందాలు ఇలాంటివే. అప్పట్లో ఇవి తప్పనిసరి అయ్యాయి. కానీ రానురానూ దేశవ్యాప్తంగా విద్యుత్‌ చౌకగా మారిపోతున్న పరిస్ధితుల్లో ఈ ఒప్పందాలు ఏపీ ప్రభుత్వానికి గుది బండగా మారాయి. అయినా వీటి నుంచి వెనక్కి తగ్గేందుకు కేంద్రం ససేమిరా అంటోంది. దీంతో చచ్చినట్లు వాటిని మరికొన్నేళ్ల పాటు భరించక తప్పని పరిస్ధితి.

జగన్‌ సర్కారుకు కేంద్రం మరో షాక్...

జగన్‌ సర్కారుకు కేంద్రం మరో షాక్...

గతేడాది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లూరులోని మూడు ప్లాంట్‌తో 800 మెగావాట్ల చొప్పున కుదిరిన 2400 మెగావాట్ల ఒప్పందాన్ని, కూడ్గిలోని మూడు ప్లాంట్లతో 500 మెగావాట్ల చొప్పిన కుదిరిన 1500 మెగావాట్ల ఒప్పందం నుంచి వైదొలగేందుకు అనుమతించాలని ట్రాన్స్‌కో ఎన్టీపీసీకి లేఖ రాసింది. వీటి నుంచి తీసుకునే విద్యుత్‌కు బండిల్‌ పవర్ పేరుతో యూనిట్‌కు దాదాపు పది రూపాయలు చెల్లించాల్సి వస్తోందని జగన్‌ సర్కారు ఎన్టీపీసీకి తెలిపింది. అందుకే వీటి నుంచి తప్పుకునేందుకు అవకాశం కల్పించాలని కోరింది. కానీ ఎన్టీపీసీ తాజాగా దాన్ని తిరస్కరించింది. పాత ఒప్పందాల నుంచి వైదొలగేందుకు అవకాశం ఇవ్వలేమని తాజాగా ట్రాన్స్‌కోకు రాసిన లేఖలో ఎన్టీపీసీ పేర్కొంది.

పీపీఏల సమీక్షపై కేంద్రం సీరియస్‌

పీపీఏల సమీక్షపై కేంద్రం సీరియస్‌

గతంలో వివిద రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ పంపిణీ సంస్ధలతో కుదుర్చుకున్న ఒప్పందాల సమీక్షకు కేంద్రం వ్యతిరేకంగా ఉంది. పీపీఏల సమీక్ష కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు చెక్‌ పెట్టేందుకు ఏకంగా కేంద్ర విద్యుత్‌ చట్టంలోనే సవరణలకు ప్రయత్నిస్తోంది. జగన్‌ సర్కారు గతంలో టీడీపీ కుదుర్చుకున్న పీపీఏలను సమక్షించాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఇంధన వనరులశాఖ మంత్రి ఆర్కేసింగ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సహజంగానే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్టీపీసీ కూడా పాత ఒప్పందాలను గౌరవించాల్సిందేనని రాష్ట్రాలకు స్పష్టం చేస్తోంది. ఇది జగన్‌ సర్కారుకు శరాఘాతంగా మారిపోతోంది. విద్యుత్‌ తీసుకున్నా తీసుకోపోయినా వీటికి డబ్బులు చెల్లించక తప్పని పరిస్ధితి.

  AP Schools Reopening సాధ్యమేనా ? వ్యాక్సిన్‌ వచ్చే వరకూ స్కూళ్లను మూసెయ్యాలి!
  అప్పుల రాష్ట్రంపై మరో పిడుగు...

  అప్పుల రాష్ట్రంపై మరో పిడుగు...

  అసలే ఉద్యోగుల జీతభత్యాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలకూ ఖర్చు చేసేందుకు అప్పులు చేసుకోవాల్సిన పరిస్ధితుల్లో ఉన్న ఏపీ సర్కారుకు ఈ పాత ఒప్పందాలు గుది బండగా మారిపోతున్నాయి. వీటిలో ఏ ఒక్క ఒప్పందం నుంచి తప్పుకునేందుకు కూడా ప్రభుత్వానికి అవకాశం లభించకపోవడంతో తప్పనిసరిగా భవిష్యత్తులో వీటి భారం భరించేందుకు సిద్ధం కావాల్సిన పరిస్ధితి. ఎలాగో అప్పులతోనే పాలన సాగుతోంది కాబట్టి మరి కొంత అప్పులు తెచ్చయినా విద్యుత్‌ ఒప్పందాలను కొనసాగించాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది. దీంతో ఎన్టీపీసీ తాజా నిర్ణయంపై ప్రభుత్వం సర్దుకుపోతుందా లేక న్యాయపోరాటం చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

  English summary
  national thermal power corporation (ntpc) has rejected jagan government's proposals to withdraw from valluru and kudgi power purchase agreements with higher charges.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X