ఎన్నికల కోడ్ ముగిసింది, సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు, అన్నగారికి జై
ఆంధ్రప్రదేశ్ లో గురువారం సాయంత్రానికి ఎన్నికల కోడ్ ముగిసిపోయింది. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలు, వైఎస్ఆర్ విగ్రహాలకు ముసుగులు తొలగిస్తున్నారు. ఎన్నికల కోడ్ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు ముసుగులు వేశారు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని కూడల్లలో వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాలకు, వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహాలకు ముసుగులు తొలగించారు.

మాజీ మంత్రి ఆర్ కే రోజా సొంత నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. నగిరిలో పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. గురువారం మద్యాహ్నం చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు, నగిరి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగులు తొలగించడానికి ప్రయత్నించారు.
ఆ సందర్బంలో పోలీసులు ఎన్నికల కోడ్ ఇంకా ముగిసిపోలేదని టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిపోవడంతో నగిరి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి ముసుగులు తొలగించి పూలమాలలు వేసి విజయోత్సవాలు జరుపుకున్నారు. రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన రోజా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు.
10 ఏళ్ల నుంచి నగిరిలో మౌనంగా ఉంటున్న టీడీపీ నాయకులు ఇప్పుడు తమ పార్టీ నాయకుడు భాను ప్రకాష్ నగిరిలో ఎమ్మెల్యేగా గెలిచారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సంతోషంతో భారీ ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పుంగనూరు, పలమనేరు, నగిరి, జీడీ నెల్లూరు, చిత్తూరు నగరంతో పాటు జీడీ నెల్లూరు, పుతలపట్టులో ఎన్టీఆర్ విగ్రహాలకు భారీ ఎత్తున పూలమాలలు వేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.












Click it and Unblock the Notifications