బాలయ్య ఎన్టీఆర్ సినిమాకు తొలి షాక్ : అలా చూపిస్తే కోర్టుకు వెళ్తానన్న లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానంటూ నందమూరి బాలకృష్ణ ప్రకటించడం ఒక సంచలనమైతే... దీనిపై ఇప్పుడు వివాదమూ రాజుకుంది. సినిమాలో తనను విలన్ గా ఎమ్మెల్యే బోండా ఉమ అభివర్ణించడంపై లక్ష్మీపార్వతి ఘాటుగానే స్పందించ

హైదరాబాద్: ఎన్టీఆర్ పై బయోపిక్ తీస్తానంటూ నందమూరి బాలకృష్ణ ప్రకటించడం ఒక సంచలనమైతే... ఆ సినిమాని అంత సమర్థంగా తీయగల డైరెక్టర్ ఎవరన్న విషయంపై ఇప్పటికే ఆసక్తికరంమైన చర్చ మొదలైంది.

చర్చల మాట అటుంచితే, దీనిపై ఇప్పుడు వివాదమూ రాజుకుంది. ఎన్టీఆర్ బయోపిక్ లో విలన్ ఎవరన్న విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ''ఇంకెవరు? అందులో విలన్ ఎవరైనా ఉన్నారంటే.. అది లక్ష్మీపార్వతే..'' అని ఎమ్మెల్యే బోండా ఉమ వ్యాఖ్యానించి వివాదాన్ని రాజేశారు.

ఓ డిబేట్ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ సినిమాలో తనను విలన్ గా అభివర్ణించడంపై లక్ష్మీపార్వతి ఘాటుగానే స్పందించారు. ''బాలయ్య ఎన్టీఆర్ పై సినిమా తీస్తే తాను సదా స్వాగతిస్తానని, అయితే కథను వాస్తవంగా కాక వక్రీకరించి అన్యాయంగా తీస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని హీరోగా చూపించి.. తనను విలన్ గా చూపిస్తే మాత్రం సినిమాపై కోర్టుకు వెళతానని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భార్య బతికే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె బాలకృష్ణకు సూచించారు.

ఎన్టీఆర్ చేసిన గొప్ప పనులను ప్రజలకు చూపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అసలు ఎన్టీఆర్ బయోపిక్ తీయడం ఆయన కొడుకుగా బాలయ్య అదృష్టమని, ధైర్యముంటే ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చూపించాలని, లేదంటే ఆయన గొప్పతనం, సాధించిన విజయాల వరకే పరిమితం కావాలని సూచించారు.

 NTR Biopic : Lakshmi Parvati warns against idolising Chandrababu

అలా కాకుండా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని నిలబెట్టాడని తన బావ చంద్రబాబును గొప్పగా చూపించి, నన్నేదో దుష్టశక్తి మాదిరిగా చూపిస్తే క్షమించే ప్రసక్తే లేదని, కచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కుతానంటూ లక్ష్మీపార్వతి కుండబద్ధలు కొట్టారు.

ప్రజలకు ఆదర్శమైన ఓ ఎన్టీఆర్ ను చూపిస్తారా? లేక వెన్నుపోటు పొడిచిన వాళ్ల గురించి చూపిస్తారా? దీనిపై ముందే ఆలోచించుకుని నిర్ణయించుకోవాలని.. లేదూ మసి పూసి మారేడుకాయ చేసి తలకిందులుగా చేసి చూపిస్తే మాత్రం ఎన్టీఆర్ భార్యను బతికే ఉన్నానన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

అసలు ఇప్పటి వరకు తాను పోరాడుతున్నది కూడా ఇదే అంశంపైనేనని, ఇప్పడు కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్రను వక్రీకరించి చూపిస్తే.. పోరాటానికి కూడా వెనుదీయనని, ఇవన్నీ ముందుగానే బాగా ఆలోచించుకుని ఎన్టీఆర్ బయోపిక్ తీయాలని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+