It's official: ఎన్టీఆర్ బొమ్మతో రూ. 100 నాణెం: మార్కెట్లోకి త్వరలోనే, తయారీ ఇలా
ఎన్టీఆర్ బొమ్మతో రూ. 10 వెండి నాణెం ముద్రణపై కేంద్రం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్: సినీ దిగ్గజం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(NTR) శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ. 10 వెండి నాణెం ముద్రణపై కేంద్రం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింకుతో నాణెం తయరీ ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ. 100 నాణెం త్వరలో మార్కెట్లోకి రానుందని అధికారులు తెలిపారు.

కాగా, ఈ నాణెం 44 ఎంఎం వ్యాసం కలిగి ఉంటుంది. దీనిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 4160. నాణెంపై హిందీ, ఇంగ్లీషులో సీనియర్ ఎన్టీఆర్ 100 సంవత్సరాల వార్షికోత్సవం ముద్రించబడుతుంది.
ఈ నాణెంపై 1923-2023 గుర్తు ఉంటుంది. ఈ నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం గర్వించదగ్గ నిదర్శనంగా నిలవనుంది. మరోవైపు, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ తెలుగు ప్రజలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications