తెలంగాణ టీడీపీకి 'ఎన్టీఆర్' టానిక్!, బీజేపీతో దోస్తీయే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. దానికి తోడు తెరాస ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీ వారిని చేర్చుకుంటోంది.

ఈ నేపథ్యంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ విభాగానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించాలని కేసీఆర్‌ సర్కార్‌ శాసనసభలో చేసిన తీర్మానాన్ని టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్‌ అభిమానులు నిరసించారు. ఇందుకు నిరసనగా ఇందిరా పార్కు దగ్గర చేపట్టిన రైతుల దీక్షలు, ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షలకు కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా నగరం నలుమూలల నుంచి చాలామంది తరలి వచ్చారు. దీంతో తెలంగాణలో మరింత బలపడేందుకు ఎన్టీఆర్‌ సెంటిమెంట్‌ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయంటున్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌, ఇందిరా పార్కు దగ్గర నేతలు చేపట్టిన దీక్షలు పార్టీకి టానిక్‌లా పని చేశాయంటున్నారు.

'NTR' is new strength for Telangana TDP!

ఎన్టీఆర్‌ ఘాట్‌ దగ్గర మోత్కుపల్లి చేపట్టిన దీక్షకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీకి చెందిన పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. దీక్షల కోసం ముందుగా సన్నాహాలు చేయకపోయినా పిలుపు ఇచ్చిన వెంటనే ఇంతమంది రావడం పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందంట. దీంతో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మరింత భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది.

చంద్రబాబుతో టీడీపీ నేతల భేటీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వారు పలు అంశాల పైన చర్చించినట్లుగా తెలుస్తోంది.

బాబుతో దత్తాత్రేయ భేటీ

చంద్రబాబును ఆయన నివాసంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో భేటీకి ప్రత్యేకత ఏమీ లేదని, మర్యాద పూర్వకంగానే కలిసినట్లు చెప్పారు. కార్మిక సంక్షేమ పథకాల అమలులో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని బాబు కోరారన్నారు.

బీజేపీతో దోస్తీయే

బీజేపీ, టీడీపీ పొత్తు కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం చెప్పారు. కంటోన్మెంట్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆఅసెంబ్లీలో అధికారపక్షం విపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీనిపై సోమవారం స్పీకర్‌ను కలిసి వివరిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+