అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోదావరి తీరంలో ఎన్టీఆర్ విగ్రహాం: తొలగిన అడ్డంకులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రాహాన్ని శ్రీకృష్ణుడు రూపంలో ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కోట్టేసింది.

ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి. ఖోసలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మానసం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) హైకోర్టులో ఈ పిటిషన్ దాఖళు చేసింది.

పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజకీయ నాయకుల విగ్రహాల్ని దేవతామూర్తుల రూపంలో ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. దీనిపై ధర్మానసం స్పందిస్తూ కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికి పత్రాలు ఉన్నాయా?

NTR Statue to be Installed in River Godavari

అని పిటిషనర్ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. గోదావరి నది తీరంలో శ్రీకృష్ణుని రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారని పత్రికల్లో వచ్చిందని బదులివ్వగా, ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
పూర్తి వివరాలు లేకుండా ఇందులో జోక్యం చేసుకోలేమని పిటిషన్‌ను కొట్టివేసింది.

అంతక ముందు గోదావ‌రి పుష్క‌రాల్లో ఎన్టీఆర్ విగ్ర‌హాం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలపాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు నిర్ణయం తీసుకుంది. కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని గోదావ‌రిపై రెండు వంతెన‌ల మ‌ధ్య‌నున్న గ‌ట్టు ద‌గ్గ‌ర‌ నిర్మించాల‌ని ప్ర‌భుత్వం భావించింది.

అయితే, ఈ నిర్ణ‌యంపై ప్రజల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. రాజ‌మండ్రిలో జ‌రిగిన అఖిలప‌క్షంలో నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పుష్క‌రాల స‌మ‌యంలో ఏర్పాటు చేయ‌డం భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తుంద‌ని అఖిల ప‌క్షం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

English summary
NTR Statue to be Installed in River Godavari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X