ఎన్టీఆర్ వర్థంతికి లెజండరీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం: భువనేశ్వరీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు.

వారానికి ఒక్క పూట, ఆమె సహకారం: భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికరం

జనవరి 18న దేశ వ్యాప్తంగా 120 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశంలోని 16 రాష్ట్రాలు, 300 బ్లడ్ బ్యాంకులతో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఫేస్ బుక్' తో కలిసి రక్తదానంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని భువనేశ్వరి చెప్పారు.

NTR Trust conducts legendary blood donation drive on Jan 18 says Nara bhuvaneshwari

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చే.పట్టినట్టు భువనేశ్వరీ చెప్పారు. 12 లక్షల మందికి వైద్య సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు.అనాధ పిల్లలకు చదువు చెప్పిస్తున్నట్టు ఆమె చెప్పారు. నిరుద్యోగులకు సుమారు రూ.8 కోట్ల సహయం చేశామని చెప్పారు.

ఇప్పటివరకు రక్తదానం చేసిన వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.రక్తదానం చేసేందుకు సహకరిస్తున్న రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chandrababu's wife, Nara Bhvaneshwari, speaking on behalf of NTR Trust, announced that a country-wide Legendary Blood Donation Drive is being held on January 18th, 2018 to commemmorate the 22nd death anniversary of her father,

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి