న్యూఢిల్లీ వెళ్లాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక
ఇటీవలి కాలంలో భద్రతాపరమైన పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో కొన్ని రైళ్లు ఆయా జోన్లవారీగా రద్దవుతూ వస్తున్నాయి. అయితే ఈసారి ఏకంగా 300 రైళ్లు రద్దుకాబోతున్నాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో రైళ్లు రద్దుకావడానికి కారణాలేంటో తెలుసుకుందాం. నార్తర్న్ రైల్వే పరిధిలో ఏకంగా 300 రైళ్లు రద్దు కానున్నాయి. ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర ససమావేశం జరగబోతోంది.
ఈ సమావేశానికి ప్రపంచం నలువైపుల నుంచి దేశాధినేతలు, ప్రముఖులు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లలో భాగంగా పలు మార్గాల్ని నిషేధించింది. ఢిల్లీలో దుకాణాలు, వ్యాపారాలు, ఇతర సంస్థలు మూసివేయనున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఢిల్లీ రైల్వేస్టేషన్ రద్దీ తగ్గించేందుకు వీటిని రద్దు చేశారు. సెప్టెంబరు 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్తర రైల్వే పరిధిలో 200 రైళ్లు రద్దు చేశారు. మరో 100 రైళ్లను దారి మళ్లిస్తున్నారు.

కొన్ని రైళ్లు రీ షెడ్యూల్ అవుతున్నాయి. మరి కొన్ని రైళ్లు టెర్మినల్ ఛేంజ్ అవుతున్నాయి. ఏయే రైళ్లు రద్దయ్యాయి? ఏయే రైళ్లు దారి మళ్లుతున్నాయనే సమాచారంతో జాబితాను విడుదల చేసింది. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ ఢిల్లీ, ఇతర సమీప ప్రాంతాలకు వెళ్లే ఆలోచన చేస్తున్నవారు లేదంటే టికెట్ ఇప్పటికే రిజర్వేషన్ చేయించుకున్నవారు ఈ జాబితాను పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
జీ20 సదస్సుతో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పటికే ప్రకటించారు.












Click it and Unblock the Notifications