• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రా భూభాగంలో ఒడిశా అధికారుల హల్చల్ .. అంగన్‌వాడీ కేంద్రానికి తాళం ; ఘటనపై అధికారుల దర్యాప్తు

|

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒడిశా అధికారుల తీరుతో కొత్త సమస్య వచ్చి పడింది. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామంలో కలకలం రేగింది. ఒడిస్సా అధికారుల తీరు కొత్త వివాదానికి కారణం గా మారింది. ఆంధ్రా ఒడిశా సరిహద్దు గ్రామాలలో వివాదాలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఒడిశా సరిహద్దు గ్రామంలోని ఆంధ్ర భూభాగంలో తాజాగా ఒడిశా అధికారులు హల్చల్ చేయడం, ఓ అంగన్వాడీ కార్యాలయానికి తాళం వేయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర అంశంగా మారింది.

మాణిక్యపురం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేసిన ఒడిశా అధికారులు
నిన్నటి వరకు విజయనగరం జిల్లా కొట్టిస గ్రామాల చుట్టూ తలెత్తిన సరిహద్దు వివాదం, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సిక్కోలులో వెలుగు చూసింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట పంచాయతీ మాణిక్యపురంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంగన్వాడీ కేంద్రానికి ఒడిశా అధికారులు తాళం వేసిన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రజలను షాక్ కు గురి చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒడిశా అధికారుల పెత్తనం అంటూ స్థానికంగా చర్చ జరిగింది. ఇక తాజాగా ఏపీలో అంగన్ వాడీ కేంద్రానికి తాళం వేసిన ఒడిశా అధికారులు ఆ అంగన్వాడి కేంద్రం తమ భూభాగంలో ఏర్పాటు చేశారంటూ తాళం వేశారు.

Odisha officials seized Anganwadi center in ap border village, Authorities are investigating

అడ్డుకునే ప్రయత్నం చేసిన అంగన్‌వాడీ కార్యకర్త భర్తను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు
ఒడిశా అధికారులు ఏపీ భూభాగంలోకి వచ్చి హంగామా చేస్తున్న క్రమంలో అంగన్వాడి కార్యకర్త భర్త వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది తమ పరిదిలోనిది కాదని చెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఒడిశా అధికారులు అవేవీ పట్టించుకోకుండా అంగన్ వాడీ కేంద్రానికి తాళం వేశారు. ఈ క్రమంలో పోలీసులు ఒడిశా అధికారులను అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్త సవర లక్ష్మి భర్తను అరెస్టు చేసి పర్లాకిమిడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో మాణిక్యపురం గ్రామస్తులు సవర లక్ష్మి భర్తను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.

Rashmika Mandanna : టాప్ లేపుతున్న లేటెస్ట్ ఫొటోస్ , కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుందిగా (ఫోటోలు)..
అంగన్‌వాడీ కేంద్రానికి తాళం వేసిన ఘటనపై ఏపీ ఉన్నతాధికారుల విచారణ
ఇక సిక్కోలులో చోటు చేసుకున్న ఒడిశా అధికారుల నిర్వాకంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అక్కడకు వెళ్లిన అధికారులు అది ఆంధ్ర భూభాగమేనని తేల్చారు. స్థానికులు అక్కడ విచారణకు వచ్చిన అధికారులకు జరిగింది వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడు మండలాల పరిధిలో ఆంధ్రా ఒడిశా సరిహద్దు విస్తరించి ఉందని, ఇంత కాలం అది ఆంధ్ర భూభాగం గానే కొనసాగిందని, ఇప్పుడు ఒడిశా తమ భూభాగం అనడం, అంగన్వాడీ కేంద్రానికి తాళం వేయడాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో కొత్త సమస్య .. ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు ఏం చేస్తాయో?
ఇంతకాలం ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుల మధ్య ఎక్కడా వివాదాలకు తావులేకుండా ప్రజలు జీవనం సాగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుతూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు అన్నదమ్ముల మాదిరిగా జీవనం సాగిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఓ అంగన్వాడి కేంద్రాన్ని తమ భూభాగంలో ఉందని ఒడిశా అధికారులు తాళం వేయడం ఇరు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర భూ సమస్యకు ఆజ్యం పోసినట్లయింది. మరి ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న అధికారులు, ఒడిస్సా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఏం నిర్ణయం తీసుకుంటారు, అంగన్వాడీ కేంద్రాన్ని సీజ్ చేసిన ఒడిశా అధికారులు తమ భూభాగం అని చెప్తున్న క్రమంలో ఒడిశా ప్రభుత్వం వారు చెప్పింది పరిగణనలోకి తీసుకుంటుందా ? లేకా ఏపీ సర్కార్ చెప్పేది వింటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఒడిస్సా పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్లిన అంగన్వాడీ కార్యకర్త భర్తను విడిపించడానికి కూడా అధికారులు ఏం చేయబోతున్నారని కూడా తెలియాల్సి ఉంది.

English summary
An incident took place when Odisha authorities locked the Anganwadi Center in Andhra Pradesh state in Manikyapuram, Sabakota panchayat, Srikakulam district. Shocked the local people. There has been a local debate over the Odisha authorities act in Andhra Pradesh. Odisha authorities, who recently locked up the Anganwadi Center in AP, they arrested the anganwadi worker husband and said the Anganwadi Center was set up in their territory. Authorities are investigating.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X