Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ 141 మంది తెలుగు వారి ఆచూకీ ఎక్కడ - పెరుగుతున్న ఆందోళన..!!

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం ఏపీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రమాదానికి గురైన రెండు రైళ్లల్లో రాష్ట్రానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రైల్వే రిజర్వేషన్ జాబితాలకు అనుగుణంగా ప్రయాణీకుల సమాచారం సేకరించే ప్రయత్నం చేసారు. ఘటనా స్థలికి మంత్రి అమర్నాధ్..అధికారులు వెళ్లారు. విశాఖ, విజయవాడకు ప్రత్యేక రైళ్లల్లో ప్రమాదానికి గురైన రైలు ప్రయాణీకులు చేరుకున్నారు. మరో 141 మంది సమాచారం తెలియాల్సి ఉందని చెబుతున్నారు.

ప్రమాదంలో తెలుగు ప్రయాణీకులు: ఒడిశాలో జరిగిన ప్రమాదంలో రెండు రైళ్లల్లోనూ ఏపీ వాసులు ఉన్నారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీకి చెందిన వారు ఉన్నట్టుగా గుర్తించారు. విశాఖపట్నంలో దిగాల్సినవారు 309 మంది, రాజమండ్రిలో దిగాల్సినవారు 31, ఏలూరులో దిగాల్సినవారు 5 గురు, విజయవాడలో దిగాల్సిన వారు 137 మంది ఉన్నారు.

Odisha Train Accident: AP Govt focusing on missing 141 passengers in Odisha Train Accident

ప్రయాణికుల్లో 267 మంది సురక్షితంగా ఉండగా.. 20 మందికి స్వల్పంగా గాయాలు కాగా, 82 మంది ప్రయాణాలను రద్దుచేసుకున్నట్టు తేల్చారు. 113 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అవ్వటంతో ప్రస్తుతం వీరి వివరాలను సేకరించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొంత మంది గాయపడినట్లు తమకు సమాచారం అందిందని ప్రభుత్వం వెల్లడించింది.

141 మంది ఆచూకీ కోసం: యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రం నుంచి 89 మంది రిజర్వేషన్లు చేసుకున్నట్లు గుర్తించారు. విశాఖపట్నంలో 33 మంది, రాజమండ్రిలో 3, ఏలూరు నుంచి ఒక్కరు, విజయవాడ నుంచి 41, బాపట్లలో 8 , నెల్లూరు నుంచి 3 ఉన్నట్లు అధికారులు నిర్దారించారు. ఇందులో 49 మంది సురక్షితంగా ఉన్నారని, స్వలంగా గాయాలు అయినవారు ఇద్దరు ఉన్నారని వెల్లడించారు.

10 మంది ప్ర‌యాణాన్ని ర‌ద్దు చేసుకున్నార‌ని, 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో, లేదా స్విచాఫ్‌ అయినట్లు చెబుతున్నారు. అందరితో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మొత్తంగా 141 మంది ప్రయాణీకుల ఫోన్లలో అందుబాటులోకి రాకపోవటంతో వారి గురించి ప్రభుత్వం భిన్న మార్గాల ద్వారా సమాచారం సేకరించే ప్రయత్నం కొనసాగిస్తోంది.

ప్రభుత్వం ప్రయత్నాలు: గాయపడినట్లుగా గుర్తించిన వారికి ఒడిశాలోనూ అవసరమైన వారికి వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఏపీకి వస్తున్న వారిలో విశాఖలో దిగే వారే అధికంగా ఉన్నట్లు రిజర్వేషన్ ఛార్జులను బట్టి తెలుస్తోంది. ఈ రైల్లో ఏపీ ప్రయాణీకులు ఎక్కువ మంది థర్డ్ ఏసీ బోగీలైన బీ1, బీ2, బీ4, బీ5, బీ8, బీ9లో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.

ప్రమాదంలో జనరల్ బోగీలతో పాటుగా బీ1 నుంచి బీ6 వరకు ఉన్న బోగీలు బాగా దెబ్బ తిన్నట్లు క్షతగాత్రులు..ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రయాణీకుల బంధువులు హెల్ప్ లైన్ లను సంప్రదించి...సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ 141 మంది సమాచారం కోసం కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+