స్కూళ్లకు దసరా సెలవులపై తాజా నిర్ణయం - అమలు ఇలా..!!
దసరా సెలవుల పైన ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. దసరా సెలవుల పైన ముందుగానే ప్రకటన చేసినా.. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో సెలవులు ఇస్తున్నారు. దీంతో, ఈ సెలవుల కారణం గా సిలబస్ కు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో దసరా సెలవుల పైన కొంత సందిగ్ధత నెలకొంది. కాగా..ముందుగా ప్రకటించిన విధంగానే దసరా సెలవుల కొనసాగింపుకు అధికారులు నిర్ణయించారు.
ప్రస్తుత ఆగస్టు నెలలో స్కూళ్లకు సాధారణ సెలవులతో పాటుగా వర్షాల కారణంగా మరిన్ని సెలవులు వచ్చాయి. ఇక, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలీడేస్ ప్రకటించనున్నారు. ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి.

కాగా, ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజులు సెలవులు వచ్చాయి. ఇక.. భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం నేడు (సోమవారం) సెలవు ప్రకటించింది. అందులో భాగంగా విశాఖ,అల్లూరి జిల్లాలోని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కొడుతున్న వానలకు చాల జిల్లాలు జలమయం అయ్యాయి. జన సంచారం స్థంబించిపోయింది. దీంతో.. విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ మూడోవారం నుంచి రెండు రాష్ట్రాల్లో పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దసరా ను ప్రత్యేకంగా పరిగణిస్తారు. సొంత గ్రామాలకు వెళ్లి ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేస్తుంది. అయితే.. వరుస వర్షాల కారణంగా పాఠశాలలకు ఈ నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో సెలవులు ఇచ్చారు. ఇక.. దసరా సెలవుల విషయంలోనూ స్పష్టత రావటంతో.. ఇక, సెలవుల్లో పండుగ జరుపుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications