మూడేళ్ల బాలికలపై వృద్ధుడి పైశాచికం: నీలి చిత్రాలు చూపించి.. అదే తరహాలో!

Subscribe to Oneindia Telugu

గుంటూరు: దేశంలో చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరుకు చెందిన జానీ బాషా అనే వృద్ధుడు అభం శుభం తెలియని బాలికలపై లైంగిక దాడి చేసిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

బార్ డ్యాన్సర్ గుప్పిట్లో ఇరుక్కున్న వ్యాపారి, డబ్బు కోసం బ్లాక్‌మెయిల్, అక్క చేసిందని చెల్లి కూడా!

గుంటూరులోని లాలాపేట చిన్నబజారుకు చెందిన జానీ బాషా పెళ్లి సంబంధాలు కుదిర్చే మధ్యవర్తిగా జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి నలుగురు కుమార్తెలు కాగా.. అందరికీ పెళ్లిళ్లు చేశాడు. భార్య చనిపోవడంతో ఇంట్లో ఒక్కడే ఒంటరిగా జీవిస్తున్నాడు.

ఇదే క్రమంలో నవంబర్‌ నెలాఖరున తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ముగ్గురు బాలికలను మాయ మాటలతో ఇంట్లోకి తీసుకెళ్లాడు. వారి వయసు 3-4ఏళ్లు ఉండవచ్చునని తెలుస్తోంది.

old man sexual assault on 3year old girls in guntur

ఇంట్లోకి తీసుకెళ్లిన వృద్ధుడు సెల్‌ఫోన్‌లో వారికి నీలి చిత్రాలు చూపించి.. అందులో ఉన్నట్లే వారితోనే వ్యవహరించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఆదివారం బాధిత బాలిక కడుపు నొప్పితో బాధపడటంతో.. తల్లి ఆమెను ఆరా తీసింది. దీంతో అసలు విషయం బయటపడింది.

తనతో పాటు మరో ఇద్దరు బాలికల పట్ల కూడా ఇలాగే వ్యవహరించాడని చెప్పింది. సోమవారం జానీబాషా లాలాపేట చిన్నబజా రులో ఉన్నాడని తెలుసుకుని బాలికల తల్లిదండ్రులు వెళ్లి అతడిని నిలదీశారు. ఇంతలో బాషా బంధువులు వచ్చి అతన్ని తీసుకెళ్లిపోయారు. అనంతరం బాధిత బాలికల తల్లిదండ్రులు లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 60year old man sexually harassed three girl in Guntur, victim parents lodged a complaint in near by police station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి