విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టపగలే మహిళ ఆభరణాల చోరీ: ఖరగ్‌పూర్ నుంచి పిస్టళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Old woman robbed in Guntur district
గుంటూరు/ విశాఖపట్నం: గుంటూరు జిల్లాలో పట్టపగలే దోపిడీ జరిగింది. ఆరుబయట నిద్రిస్తున్న ఓ వృద్ధురాలి మెడలోని గొలుసును, చెవిదుద్దులను గుర్తుతెలియని దుండగులు లాకెళ్లారు. తెనాలిలోని ఏఎంసీ కాలేజీ ఎదుట ఉన్న ఈముపక్షుల ఫాంహౌస్‌లో సోమవారం మధ్యాహ్న 3గంటలకు ఈ ఘటన జరిగింది. రామకోటేశ్వరమ్మ(60) అనే వృద్ధురాలు ఫాంహౌస్‌లో పనిపూర్తి చేసి సేదతీరుతోంది.

కాసేపటికి ఆవిడ నిద్రలోకి జారుకుంది. ఇంతలో ఇద్దరు దొంగలు వృద్ధురాలి మెడలోని రెండు బంగారు గొలుసులు, చెవిదుద్దులు లాక్కెళ్లారు. చెవిదుద్దులు రాకపోవడంతో చెవులు కోసి దోపిడీ చేశారు. విడ్డూరం ఏంటంటే నిద్రలో ఉన్న తనకు, ఇదంతా తన కలలో జరుగుతున్నట్లు ఆ వృద్ధురాలు భావించడం.

విశాఖ జిల్లాలో ఇద్దరి అరెస్టు

విశాఖ జిల్లా అనకాపల్లి మెయిన్‌రోడ్డులో ఇటీవల ఓ వ్యక్తిపై పిస్టల్‌తో కాల్పులు జరిపి, హత్యచేసేందుకు యత్నించిన కేసులో ఇద్దరు నిందితులు రాజేష్‌ కార్తీక్‌లను ఆదివారం అనకాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు పిస్టళ్లు, 13 బుల్లెట్లు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ కోయప్రవీణ్‌ విలేకరులకు తెలిపారు.

అనకాపల్లిలోని సతకంపట్టు జంక్షన్‌కు చెందిన దాడి కృష్ణ, గవరపాలేనికి చెందిన కర్రి రాజేష్‌ ఆర్థిక లావాదేవీల విషయమై గొడవపడి ఘర్షణకు దిగడంలో గత మార్చి 23న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను చికిత్స తర్వాత పోలీసులు అరెస్టుచేసి సబ్‌జైలుకు పంపగా.. పరారైన కృష్ణ ముందస్తు బెయిల్‌ పొందాడు.

జైలులో సహనిందితుడు రేవళ్ల కార్తీక్‌తో పరిచయం పెంచుకున్న రాజేష్‌ తాను కృష్ణను చంపాలనుకుంటున్నానని చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత వారు ఇద్దరు బెయిల్‌పై విడుదలయ్యారు. తనకు రెండు పిస్టళ్లు కావాలని రాజేష్‌ కోరడంతో కార్తీక్‌ ఖరగ్‌పూర్‌ నుంచి రూ. 60 వేలకు రెండు పిస్టళ్లను తెప్పించి వాటిని రాజేష్‌కు అమ్మాడు. కృష్ణపై కసి పెంచుకున్న రాజేష్‌ గత నెల 26వ తేదీ రాత్రి బైక్‌పై వచ్చి కుంచావారి గైరమ్మ ఆలయం వద్ద ఓ టీ దుకాణంలో ఉన్న దాడి కృష్ణపై పిస్టల్‌తో కాల్పులు జరపగా అది పేలలేదు. దీంతో భయపడి అక్కడి నుంచి బైక్‌పై పారిపోయి కశింకోట మండలం బయ్యవరం రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న పొదల్లో పిస్టళ్ల ను దాచేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు.

రెండు రోజుల క్రితం కార్తీక్‌ వద్దకు వెళ్లి, పేలని పిస్లళ్లు అంటగట్టావని రాజేష్‌ గొడవపడ్డాడు. ఆ తర్వాత వారిద్దరు ఆదివారం బయ్యవరం వచ్చి, పొదల్లో దాచిన పిస్టళ్లను తీసుకున్నారు. అక్కడి నుంచి విశాఖపట్నం వెళుతుండగా దారిలో వారిని అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు రాజేష్‌ నుంచి పిస్టల్‌, ఆరు బుల్లెట్లు, కార్తీక్‌ నుంచి పిస్టల్‌, ఏడు బుల్లెట్లతోపాటు జర్కిన్‌, సెల్‌ఫోను, అప హరించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు.

English summary
Unidentified persons have stolen gold ornments from an old lady in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X