వ్యసనాలకు బానిసైన దొంగతనాలు (ఫోటోలు)

విశాఖపట్నం: ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని గాజువాక క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ కమిషనరేట్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, కొమటిపల్లి గ్రామానికి చెందిన కొల్లి జగన్ మోహన్ రావు రంగారెడ్డి జిల్లా చింతల సమీపంలోని శ్రీనివాసనగర్‌లో ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసైన అతను దొంగతనాలకు అలవాటుపడ్డాడు.

ఈ క్రమంలో గత జులై 30న ఉదయం 10గంటల సమయంలో గాజువాక షీలానగర్, సాయి ప్రభాగ్రూప్‌కు చెందిన అయినాడ రాజశేఖర్ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు.

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అల్మారాలోని 128.40 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించాడు. వాటిని అక్కిరెడ్డి పాలెం మణిపురం గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టాడు.

One arrested for robbery in Visakhapatnam

బాధితుని ఫిర్యాదు మేరక కేసు నమోదు పోలీసులు తూర్పుగోదావరి జిల్లా పరస్పరం పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

అతని నుంచి విశాఖ పోలీసులు 128.40 గ్రాముల బంగారం, కాకినాడ పోలీసులు 430 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి, హోండా ఎలంట్రీ కారు, మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కాకినాడ ప్రాంతంలో ఏడు నేరాల్లో జగన్ మోహన్ రానవు నిందితుడని వారు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+