రెండు రాష్ట్రాలకు పదేళ్లు ఒకే గవర్నర్: టి కేబినెట్ కీలకం

 One governor to AP and Telangana
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉంటారని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ బిల్లు-2013లో కేంద్రం ప్రతిపాదించింది.

పదేళ్ల తరువాత రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉంటారు. అలాగే సీమాంధ్ర రాష్ట్రంలో కొత్త హైకోర్టు ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌లోనే ఆ రాష్ట్ర హైకోర్టు ఉంటుంది. ఉమ్మడి రాజధాని పరిధిలో శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, కీలకమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవస్ధల బాధ్యతలను ఉమ్మడి గవర్నర్ చేతిలోనే ఉంటాయి.

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని సంప్రదించిన అనంతరం గవర్నర్ శాంతిభద్రతలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయాధికారం గవర్నర్‌కు ఉంటుంది.

అరుణాచల్ ప్రదేశ్ తరహాలో శాంతిభద్రతల నియంత్రణాధికారాన్ని 371 (హెచ్) కింద గవర్నర్‌కు ఇవ్వాలనే ప్రతిపాదన జివోఎం ముందుకు వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు రాష్టమ్రైనందున 371 (హెచ్)ను అమలు చేశారు. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. కాని ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి వాతావరణం లేదు. అందుకే బిల్లులో అరుణాచల్ ప్రదేశ్ తరహా గవర్నర్‌కు శాంతి భద్రతలపై నియంత్రణాధికారాన్ని అప్పగిస్తూ ప్రతిపాదించలేదు.

శాంతి భద్రతల విషయంలో నిర్ణయాధికారం గవర్నర్‌కే ఉన్నా, తెలంగాణ మంత్రివర్గంను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాధికారం కూడా కేవలం ఉమ్మడి రాజధానికే పరిమితం చేశారు. పోలీసులు, శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అధికారాల్లోకి వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+