వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలుడు:ఒకరు మృతి, 9 మందికి గాయాలు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: అచ్యుతాపురంలోని సెజ్‌లో ఉన్న ఆంజనేయ్ ఎల్లాయిస్ కర్మాగారంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒక కార్మికుడు మృతిచెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖలోని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, మిగిలిన కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేశారు. ప్రమాదపు వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంజనేయ్‌ ఎల్లాయీస్‌లో నాలుగు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు వుండగా, శనివారం రాత్రి మూడింటిలో ఉత్పత్తి పనులు జరుగుతున్నాయి. ఒక్కొక్క ఫర్నేస్‌ వద్ద ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మూడో ఫర్నేస్‌లో పేలుడు సంభవించింది. అత్యంత వేడితో వున్న ఖనిజ పదార్థాలు తీవ్ర ఒత్తిడితో వెలుపలికి వచ్చాయి. ఇవి అక్కడ వున్నవారితోపాటు మిగిలిన రెండు ఫర్నేస్‌ల వద్ద పనిచేస్తున్న వారిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే తోటి కార్మికులు స్పందించి, కంపెనీకి చెందిన బస్సులో విశాఖపట్నంలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా కోల్‌కతాకు చెందిన మెకానిక్‌ బి.బిస్వాస్‌(42) మృతి చెందాడు. శ్రీకాకుళానికి చెందిన మరో మెకానిక్‌ అరుణ్‌ కుమార్‌(23), అనకాపల్లికి చెందిన యు. రమేష్‌(22), చక్రవర్తి(32), పశ్చిమ బెంగాల్‌కి చెందిన సంజయ్‌ రాజ్‌(31), మధుసూదన్‌ మహతి(35) ఖమ్మంకు చెందిన బి.వీరన్న(30), మునగపాక మండలం చూచుకొండకు చెందిన డి. వెంకటేశ్వరరావు(45), కె.సత్తిబాబు(44), అచ్యుతాపురం మండలం భోగాపురానికి చెందిన కూండ్రపు లక్ష్మణ(40) చికిత్స పొందుతున్నారు.

వీరిలో అరుణ్‌ కుమార్‌(23) శరీరం 90 శాతం వరకు కాలిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా వుందని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రి ప్లాస్టిక్‌సర్జరీ వైద్యురాలు డాక్టర్‌ సాప్లే తెలిపారు. ప్రమాదం తర్వాత సంఘటనా స్ధలానికి చేరుకున్న తహసీల్దార్‌ పగడాల వీరభద్రరావు ప్రమాదం గురించి కార్మికులను అడిగారు. ఆనంతరం యాజమాన్యంతో మాట్లాడారు. కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని యలమంచిలి సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.

యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు కార్మికులు ఆరోపిస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో కర్మాగారం గేటు వద్ద ఆందోళనకు దిగారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను తామే ఆస్పత్రిలో చేర్పించామని, యాజమాన్యం పట్టించుకోకపోగా ఆదివారం ఉదయం నుంచి మిగిలిన రెండు యూనిట్లలో విధులు నిర్వహించాలని ఆదేశించిందని, ఇది చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ. పది లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

 అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అచ్యుతాపురంలోని సెజ్‌లో ఉన్న ఆంజనేయ్ ఎల్లాయిస్ కర్మాగారంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒక కార్మికుడు మృతిచెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు.

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

క్షతగాత్రులను విశాఖలోని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, మిగిలిన కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేశారు.
 అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

ఆంజనేయ్‌ ఎల్లాయీస్‌లో నాలుగు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు వుండగా, శనివారం రాత్రి మూడింటిలో ఉత్పత్తి పనులు జరుగుతున్నాయి. ఒక్కొక్క ఫర్నేస్‌ వద్ద ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు.

 అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో మూడో ఫర్నేస్‌లో పేలుడు సంభవించింది. అత్యంత వేడితో వున్న ఖనిజ పదార్థాలు తీవ్ర ఒత్తిడితో వెలుపలికి వచ్చాయి.

 అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

ఇవి అక్కడ వున్నవారితోపాటు మిగిలిన రెండు ఫర్నేస్‌ల వద్ద పనిచేస్తున్న వారిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే తోటి కార్మికులు స్పందించి, కంపెనీకి చెందిన బస్సులో విశాఖపట్నంలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రికి తరలించారు.

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

చికిత్స చేస్తుండగా కోల్‌కతాకు చెందిన మెకానిక్‌ బి.బిస్వాస్‌(42) మృతి చెందాడు. శ్రీకాకుళానికి చెందిన మరో మెకానిక్‌ అరుణ్‌ కుమార్‌(23), అనకాపల్లికి చెందిన యు. రమేష్‌(22), చక్రవర్తి(32), పశ్చిమ బెంగాల్‌కి చెందిన సంజయ్‌ రాజ్‌(31), మధుసూదన్‌ మహతి(35) ఖమ్మంకు చెందిన బి.వీరన్న(30), మునగపాక మండలం చూచుకొండకు చెందిన డి. వెంకటేశ్వరరావు(45), కె.సత్తిబాబు(44), అచ్యుతాపురం మండలం భోగాపురానికి చెందిన కూండ్రపు లక్ష్మణ(40) చికిత్స పొందుతున్నారు.

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌లోని ఆంజనేయ్‌ ఎల్లాయిస్‌ కర్మాగారంలో జరిగిన ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రమాదంలో గాయపడి, విశాఖలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని ఆదివారం ఆయన పరామర్శించారు.

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిశ్రమల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడం విచారకరమన్నారు. ప్రమాదాలు జరగకుండా తగు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.

 అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

పరిశ్రమల్లో సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, తరచూ ప్రమాదాలు జరుగుతుండడం, కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలవల్ల పరిశ్రమలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని అన్నారు. ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా వుండడానికి పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి, పరిశ్రమల్లో భద్రతా పరంగా వున్న లోపాలు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నట్టు మంత్రి తెలిపారు.

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

కాగా, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని యలమంచిలి సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు కార్మికులు ఆరోపిస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో కర్మాగారం గేటు వద్ద ఆందోళనకు దిగారు.

 అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

అత్యుతాపురం సెజ్‌లో పేలుడు... ఒకరు మృతి, 9 మందికి గాయాలు

వీరిలో అరుణ్‌ కుమార్‌(23) శరీరం 90 శాతం వరకు కాలిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా వుందని సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రి ప్లాస్టిక్‌సర్జరీ వైద్యురాలు డాక్టర్‌ సాప్లే తెలిపారు. ప్రమాదం తర్వాత సంఘటనా స్ధలానికి చేరుకున్న తహసీల్దార్‌ పగడాల వీరభద్రరావు ప్రమాదం గురించి కార్మికులను అడిగారు.

English summary
One worker was killed and 10 others sustained injuries, one of them critically, following a blast in a furnace at Anjaneya Alloys Limited in the A.P. Special Economic Zone at Atchutapuram, about 50 km from here, in the early hours of Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X