నేను అంత నీచుడిని కాను: రజనీకాంత్

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహకందని మలుపులతోనే సాగుతుంటాయి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అంతకు మించిన సంచలనాన్నే సృష్టించాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా, ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. అదే సమయంలో సూపర్ స్టార్ దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అఖండ విజయం సాధించి, సరికొత్త రికార్డు సృష్టించింది.

సోషల్ మీడియాను కుదిపేసిన ఒకే ఒక్క భేటీ!

ఎన్నికల్లో స్టాలిన్ ఓడిపోయారని తెలిసిన వెంటనే, సూపర్ స్టార్ రజినీకాంత్ నేరుగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ ఒక్క భేటీ సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది సంకేతమంటూ రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి ఒకవేళ పూర్తి మెజారిటీ రాకపోతే.. ఆయనను గద్దె దించడానికే రజినీకాంత్ తెరవెనుక పావులు కదుపుతున్నారనే రూమర్స్ ఊపందుకున్నాయి. విజయ్ ని దెబ్బకొట్టేందుకు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను ఏకం చేసేందుకు రజినీ రాయబారం నడుపుతున్నారంటూ ఊహాగానాలు రావడంతో.. విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో రజినీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు ప్రారంభించారు.

Rajinikanth Says He Is Not Foolish Enough to Stop Vijay From Becoming Chief Minister

చెన్నై పోయెస్ గార్డెన్ వేదికగా క్లారిటీ ఇచ్చిన రజినీ!

ఈ వివాదం మరీ పెద్దది కావడంతో, రజినీకాంత్ స్వయంగా రంగంలోకి దిగారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ రూమర్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. "నాకూ, స్టాలిన్‌కు మధ్య ఉన్నది దాదాపు 40 ఏళ్ల నాటి స్నేహం. ఆ బంధం రాజకీయాలకు, సిద్ధాంతాలకు చాలా అతీతమైనది. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ఒక మిత్రుడిగా ఆయన ఓటమి నన్ను తీవ్రంగా బాధించింది. ఆ బాధను పంచుకోవడానికి, ఆయనకు ధైర్యం చెప్పడానికే నేను వెళ్లాను. దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదు." అన్నారు. దళపతి విజయ్ విజయాన్ని తక్కువ చేసి చూపే ఉద్దేశం తనకు లేదని రజినీకాంత్ స్పష్టం చేశారు. విజయ్ సాధించిన ఘనతను ఆయన ఆకాశానికెత్తారు. "మహానేతలు ఎంజీఆర్, ఎన్టీఆర్ సైతం సాధించలేకపోయిన అద్భుత ఘనతను విజయ్ సాధించాడు. తమిళనాడులోని రెండు అతిపెద్ద రాజకీయ శక్తులను (DMK, AIADMK) ఒంటిచేత్తో ఢీకొట్టి, ఒంటరిగా గెలిచి విజయ్ చరిత్ర సృష్టించాడు. అతని విజయం చూసి నేను నిజంగా చాలా సంతోషించాను" అని రజినీ కొనియాడారు.

ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చి ఉంటేనా..?

విజయ్‌ని ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకునేంత నీచమైన మనస్తత్వం నాది కాదు. పైగా విజయ్‌కి, నాకు మధ్య 25 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది.. అది ఒక జనరేషన్ గ్యాప్. నేను ఎప్పుడో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాను. అలాంటప్పుడు విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ ఉంటుంది? ఒకవేళ నా సమకాలీనుడైన కమల్ హాసన్ సీఎం అయ్యుంటే కాస్త అసూయపడేవాడినేమో అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు.

తాను గనుక గతంలో అనుకున్నట్టుగా రాజకీయాల్లోకి వచ్చి ఉంటే, 100 శాతం విజయం సాధించేవాడినని, అందులో తనకు ఎలాంటి సందేహం లేదని రజినీకాంత్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రి విజయ్ పై తమిళ ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, ఆయన ప్రజలకు మంచి పాలిస్తూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తారని నమ్ముతున్నట్లు రజినీకాంత్ ఆకాంక్షించారు. అలాగే సీఎం విజయ్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+