కేజీ బేసిన్లో పెట్టుబడులకు బాబుకు ఓఎన్జీసీ హామీ
హైదరాబాద్: కృష్ణా - గోదావరి బేసిన్‌లో వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని ఓఎన్జీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చింది. ఓఎన్జీసీ సీఈవో-ఎండీ షరాఫ్, కార్యనిర్వాహక నిర్దేశకుడు ఇతర నిర్దేశఖ మండలి సభ్యులు బుధవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
2018 నాటికి కేజీ బేసిన్‌లో రోజుకు 25 మిలియన్ల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను వెలికి తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబుకు వారు చెప్పారు. 2019 నాటికి చమురు వెలికితీయడంపై కూడా దృష్టి సారించినట్లు వారు తెలిపారు.

పెట్రో విశ్వవిద్యాలంయలో భాగస్వామి కావడానికి తాము ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద ఏపీలోని రెండు జిల్లాల్లో నైపుణ్యాభివృద్ధికి సహకరిస్తామన్నారు. జేఎన్టీయు సహకారంతో కాకినాడలో డీప్ వాటర్ నైపుణ్యాభివృద్ధికి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గ్యాస్ వెలికితీక వేగవంతం చేయాలని, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications