కిలో ఉల్లి 30పైసలే.. ఏపీలో రైతులను నిండా ముంచిన ఉల్లి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఏపీలో ఉల్లి పంట రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. కిలో ఉల్లిపాయల ధరలు కేవలం 30 పైసలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు. కర్నూలు మార్కెట్ చరిత్రలోనే ఉల్లి ధర ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి అని అన్నదాతలు చెబుతున్నారు.
దారుణంగా ఉల్లి ధరలు
ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర దారుణంగా పడిపోయింది. కేవలం కిలో 30 పైసలకే మార్కెట్లో లభిస్తోంది. కనీసం అర్ధరూపాయి కూడా ఉల్లి ధర పలకడం లేదు. పెద్ద ఎత్తున మార్కెట్ కు ఉల్లి దిగుమతి అవుతున్న క్రమంలో మార్కెట్లో ధర లేకపోవడం ఉల్లి రైతులను దిక్కుతోచని స్థితిలో పడేస్తోంది. మార్క్ ఫెడ్ ద్వారా ఉల్లిని కొనుగోలు చేస్తున్న అధికారులు క్వింటాల్ ఉల్లిని 1200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు.

ఉల్లిధర కిలోకి కేవలం 30 పైసలు మాత్రమే
కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వేలం వేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అయితే ఇందులో క్వింటాలుకు 30రూపాయలు మాత్రమే ధర పలకడం నష్టానికి కారణంగా మారింది అంటే కిలో ఉల్లి ధర కేవలం 30పైసలు మాత్రమే పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం ఉల్లి రైతులకు క్వింటాలుకు ఆరువేల రూపాయల వరకు ధర పలికింది. ఈ సంవత్సరం కూడా మంచి ధర వస్తుందని ఉల్లిరైతులు పెద్ద ఎత్తున ఉల్లిని సాగు చేశారు.
మార్క్ ఫెడ్ ద్వారా ఉల్లి వేలం వేస్తే కొనే నాధుడు లేడు
అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు మాత్రం పలకడం లేదు. వర్షాలు కురుస్తూ ఉండడంతో పంట కూడా కుళ్ళిపోతుంది. ఉల్లిని కర్నూలు మార్కెట్ కి తీసుకువెళ్తే కొనే దిక్కులేక సరుకును తిరిగి తీసుకు వెళ్లలేక అక్కడే వదిలిపెట్టి వెళుతున్న పరిస్థితి ఉంది. ఇక మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న ఉల్లిని కొనే నాథుడే లేడు.
మార్క్ ఫెడ్ కు తీవ్ర నష్టం
ఇప్పటివరకు ఐదు వేల టన్నుల ఉల్లిని మార్క్ ఫెడ్ కొనుగోలు చేయగా ఇందులో కేవలం 2000 టన్నులు సరుకు మాత్రమే రైతు బజార్లకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు, హైదరాబాద్ కు పంపించారు. ఇంకా 3 వేల టన్నుల ఉల్లి మార్కెట్లోనే ఉండిపోయింది . ఉల్లికి మార్కెట్ ధర లేకపోవడంతో వ్యాపారులకు అతి తక్కువ ధరకు విక్రయించడం వల్ల ఇప్పటికే ఒకటిన్నర కోట్ల రూపాయల నష్టం వచ్చింది.
ఉల్లి ధర లేక అల్లాడుతున్న రైతన్న
ఇక కుళ్లిపోయిన ఉల్లి, వ్యాపారులు కొనుగోలు చేయని ఉల్లి ద్వారా మరో రెండు కోట్లు వృధా అవుతుందని రైతులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఏపీలో ఆరుగాలం శ్రమించి ఉల్లిని సాగు చేస్తున్న రైతన్న ధర లేక అల్లాడి పోతున్నాడు. పెట్టిన పెట్టుబడి కూడా రాదని లబోదిబోమంటున్నాడు.
-
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
దూసుకొస్తున్న కరువు, వాతావరణ శాఖ హెచ్చరిక -
"ఏపీ లాసెట్" దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్..అప్లై చేసుకున్నారా ?? -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!!












Click it and Unblock the Notifications