తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతిలో మాదే విజయం-ఇంత వ్యతిరేకతా- కొడాలి ఆంబోతు వ్యాఖ్యలు- చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

తిరుపతి ఉపఎన్నిక ప్రచారం ముగింపు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో అడుగడుగునా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందన్నారు. తిరుపతిలో టీడీపీ విజయం తథమన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ తాకట్టు పెటిన వైసీపీకి మరో ఎంపీని అందించాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని తిరుపతి టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మిపై చేసిన వ్యాఖ్యలకూ చంద్రబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

 ఇంత వ్యతిరేకత జీవితంలో చూడలేదన్న చంద్రబాబు

ఇంత వ్యతిరేకత జీవితంలో చూడలేదన్న చంద్రబాబు

వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత తిరుపతి ఓటర్లపై ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తిరుపతి ప్రజల చేతుల్లో ఓటు అనే వజ్రాయుధం ఉందని, ఇది అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందన్నారు. అందుకే తిరుపతిలో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఒకప్పుడు సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ చూసినా ఏపీవైపు చూసిన పరిస్దితి ఉందని, కానీ ఇప్పుడ చూస్తే ప్రజల నోటి నుంచి వారి బాధలు విన్నా, కళ్లారా చూశా, సాక్ష్యాలూ తీసుకున్నా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ సాగుతోందని, 60-70 అడుగుల లోతుకు ఇసుక తవ్వేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అడిగితే అట్రాసిటీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. మేం మాట్లాడలేని స్ధాయికి వచ్చామని ప్రజలు చెప్తున్నారని పేర్కొన్నారు.

 ఇన్ని జరుగుతుంటే జగన్‌ మొద్దునిద్ర

ఇన్ని జరుగుతుంటే జగన్‌ మొద్దునిద్ర

రాష్ట్రం అప్పుల్లో నంబర్‌వన్ అని, అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఎస్సీలపై 150 దాడులు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించిందన్నారు.. అక్రమ కేసులు పెట్టడంలో రికార్డు స్దాయికి చేరారు. వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆస్తులు ధ్వంసం చేశారు. 2 లక్షల మందిపై బైండోవర్‌ కేసులు పెట్టారు. రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అయితే జేసీబీ వస్తుంది. వ్యతిరేకిస్తున్న ప్రజల ఆస్తుల్ని ద్వంసం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇన్ని జరుగుతుంటే ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రిని అడుగుతున్నా అని చంద్రబాబు అన్నారు. సీఎం మొద్దు నిద్ర పోతున్నారన్నారు.. ఇన్ని ఘటనలు జరిగితే మనిషి అయితే స్పందిస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం స్పందించడం లేదు. 24x7 ముఖ్యమంత్రి ఇంటి వద్ద 144 సెక్షన్ పెట్టే పరిస్ధితి వచ్చింది. రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆర్ధికంగా కోలుకోలేని పరిస్దితుల్లో జనం ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని చంద్రబాబు తెలిపారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబంలో నలుగురు ఇలాగే ఆత్మహత్య చేసుకున్నారు.

 ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హత లేదు

ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హత లేదు

రాష్ట్రంలో వెయ్యి కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయులున్నాయని,. ముఖ్యమంత్రి నాడు-నేడు అని చెప్పుకుని తిరుగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పేదల పిల్లల చదువుకు అడ్డుపడే సీఎం ఒక్క నిమిషం కూడా ఆ సీటులో కొనసాగే అర్హత లేదన్నారు.. పిల్లలకు తిండి పెట్టలేక రెసిడెన్షియల్‌ స్కూళ్లు మూతపడే పరిస్ధితికి తెచ్చారు. ఇదేనా పాలన అని అడుగుతున్నా, ఉద్యోగాలకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్ధితి. పదో తారీఖు వచ్చినా ఇంకా జీతాలు ఇవ్వలేదు. ఆర్దిక వ్యవస్ద చిన్నాభిన్నమైంది. పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. వ్యవస్ధలన్నీ పతనావస్దకు చేరుకున్నాయి. ఉద్యోగులకు డీఏ కూడా ఇవ్వలేకపోతున్నారు. సీపీఎస్ హామీ అమలు కాలేదు, పాలనపై అనుభవం లేకపోవడమే ఇందుకు కారణం. అడిగితే బెదిరిస్తా, దాడులు చేస్తా అనే పరిస్దితికి వచ్చారన్నారు..

 ఎందుకా ఎంపీలు ?

ఎందుకా ఎంపీలు ?

వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. ఆరుగురు రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు. ఏమి సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటంలేదన్నారు. పోలవరానికి నిధులు ఎంచుకు తెచ్చుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్ కాపాడారా, విభజన హామీలు అమలు చేసేలా ప్రయత్నిస్తున్నారా ? రాయలసీమ, ఉత్తరాంద్రకు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీలు ఏవీ, విశాఖ రైల్వే జోన్‌ ఏదీ, ఏదీ సాదించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎంపీలు దోచుకుని, విదేశాల్లో దాచుకునే పరిస్ధితులున్నాయని చంద్రబాబు తెలిపారు. తిరుపతి పవిత్రత పూర్తిగా దెబ్బతినే పరిస్దితి వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. విదేశాలకు ఇక్కడి ఎర్రచందనం స్మగ్లింగ్‌ యథేచ్చగా సాగుతోంది. తిరుపతిలో భూములూ కబ్జా చేస్తున్నారు. టీటీడీ ఆస్తుల అమ్మకానికి ప్రయత్నించడం చూస్తున్నాం. పింక్ డైమండ్‌ నా ఇంట్లో ఉందని మాట్లాడిన వారు ఇప్పుడు దాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తిని ప్రధాన అర్చకుడిగా నియమిస్తారా అని ప్రశ్నించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌ ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించి పదవికోల్పోయాడు. తిరుపతి బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం చేశారు. శ్రీవారి భక్తులకు అశ్లీల వెబ్‌సైట్ల లింకులు పంపిన చరిత్ర కూడా ఉంది. ఏం చర్యలు తీసుకున్నారని టీటీడీ ఈవోను ప్రశ్నించారు.

 ఎస్సీ నియోజకవర్గంలో బీసీ-సీని నిలబెడతారా ?

ఎస్సీ నియోజకవర్గంలో బీసీ-సీని నిలబెడతారా ?

ఎస్సీ నియోజకవర్గం తిరుపతిలో బీసీ-సీ అభ్యర్దిని నిలబెట్టారని పరోక్షంగా వైసీపీ అభ్యర్ది గురుమూర్తిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మతం మారితే ఎస్సీలు ఆ హోదా కోల్పోతారని, అలాంటి అభ్యర్దిని ఎస్సీ నియోజకవర్గంలో తిరిగి ఎలా నిలబెడతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, నాసిరకం 60 రూపాయల బాటిల్‌ 200 రూపాయలకు అమ్ముతున్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో పెంచిన ధరల వల్ల ఈ రెండేళ్లలో ప్రతీ కుటుంబంపై 2.5 లక్షల భారం పడిందన్నారు.

 నవరత్నాలు కావి నవమోసాలివి

నవరత్నాలు కావి నవమోసాలివి

అమ్మఒడికి 14 వేలిచ్చి మగవాళ్ల దగ్గర 30 వేలు లాగేస్తున్నారని, వాహనమిత్ర పేరుతో 10 వేలిచ్చి అది ఫైన్లలో లాగేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సెంటు భూమి ఇచ్చి 6500 కోట్ల అవినీతి చేశారని మరో ఆరోపణ చేశారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద కుంభకోణమన్నారు. 2.6 లక్షల మంది వాలంటీర్లకు రూ.5 వేలు ఇస్తున్నారని, 6 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి రద్దు చేశారని ఆరోపించారు. రైతు భరోసా కింద రూ.12500 హామీ ఇచ్చి మీరిస్తోంది 7500 మాత్రమేనని, అదీ ఇస్తారో లేదో తెలియదన్నారు. బీసీలకు కార్పోరేషన్ పదవులు ప్రకటించి వారికి బీసీ సబ్‌ ప్లాన్‌ ఎత్తేశారని, కనీసం ఛైర్మన్లకు కుర్చీలు కూడా లేవన్నారు.

 కట్టప్ప తేలినా బాబాయ్‌ను చంపిందెవరో తేలట్లేదు...

కట్టప్ప తేలినా బాబాయ్‌ను చంపిందెవరో తేలట్లేదు...

బాహుబలిని చంపింది కట్టప్ప అనేది తేలిపోయిందని, కానీ జగన్ బాబాయ్‌ను చంపిందెవరో మాత్రం తేలడం లేదని చంద్రబాబు అన్నారు. సీబీఐకి కూడా ఈ కేసు ఓ సవాలుగా తయారైందన్నారు. సీబీఐ దీన్ని బ్రేక్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ హత్యపై పూర్తి ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో సీబీఐ కూడా నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదో సంచలనమైన కేసు అని, సీఎం బాబాయ్‌ అని, మాజీ సీఎం సోదరుడు హత్య అని గుర్తు చేశారు. వివేకా కుమార్తె కూడా ఈ కేసులో సాక్ష్యుల్ని చనిపోతున్నారని ఆరోపించారు. పరిటాల రవి కేసులోనూ సాక్ష్యుల్ని ఇలాగే చంపేశారన్నారు.

 తిరుపతికి కేంద్ర బలగాలు పంపాల్సిందే

తిరుపతికి కేంద్ర బలగాలు పంపాల్సిందే

తిరుపతిలో గెలుపు కోసం వైసీపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, ఇవాళ, రేపు ఓటుకు ఐదువేలు ఇచ్చే పరిస్ధితి ఉందన్నారు. ఈ ఎన్నికలో అక్రమ ఓట్ల నిరోధానికి ఈసీకి పలు చర్యలు సూచించామన్నారు. స్దానిక అధికారులు కూడా ప్రభుత్వానికి సరెండర్‌ అయ్యే పరిస్ధితి ఉందని, అందుకే ఈసీని మైక్రో అబ్జర్వర్లను నియమించాలని కోరామన్నారు. పోలీసు వ్యవస్ద నిర్వీర్యం అయిందని, స్వయానా నాపై రాళ్లేస్తే తర్వాత రోజు డీఐజీ రాళ్లే పడలేదని బుకాయించే పరిస్ధితి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. కేంద్ర బలగాల సాయంతో ఈ ఎన్నిక నిర్వహించాలన్నారు. అవసరమైతే రెండు ఐడీ కార్డులతో ఓటింగ్‌కు అనుమతించాలన్నారు.

 కొడాలి నానివి ఆంబోతు మాటలన్న చంద్రబాబు

కొడాలి నానివి ఆంబోతు మాటలన్న చంద్రబాబు

తిరుపతి ప్రచారంలో టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మిపై మంత్రి కొడాలి నాని చేసిన విమర్శలపైనా చంద్రబాబు మండిపడ్డారు. తిరుపతి ప్రచారంలో టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మి విస్తృతంగా పర్యటించారని, పదేళ్లు మంత్రిగా, నాలుగుసార్లు ఎంపీగా పనిచేసిన పనబాక లక్ష్మిపై విమర్శలు చేసేందుకు బూతుల మంత్రికి నోరెలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ఆంబోతుల మాదిరిగా మాట్లాడితే వీళ్ల ఆటలు సాగుతాయని భావిస్తే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

English summary
tdp cheif chandrababu urges tirupati voters to utilize the opportunity to make a change in the state by using their vote in upcoming byelection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X