• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమయం లేదు మిత్రమా..! ఎన్నికల బరిలో విజేతలెవరో తేల్చడానికి మిగిలింది మరో 48 గంటలే..!!

|
  Ap Assembly Election 2019 : సమయం లేదు మిత్రమా..! మిగిలింది మరో 48 గంటలే..!! || Oneindia Telugu

  అమరావతి/హైదరాబాద్ : నెలలు వారాలుగా మారాయి.. వారాలు రోజులగా మారాయి.. రోజులు గంటలుగా మారాయి.. గంటలు క్షణాలుగా మారుతున్నాయి.. ఏపిలో ఎన్నికల ఫలితాల ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. ఓటరు మహాశయుడు ఇచ్చిన నిర్ణయం వెల్లడయ్యేందుకు ఇక 48 గంటలే మిగిలింది. ఆదివారం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా ఇప్పటికే ప్రజాతీర్పు ఎలా ఉండనుందో తెలిసినా అధికారికంగా ఫలితాలు ప్రకటించే దాకా నిరీక్షణ తప్పదు. పోలింగ్‌ పూర్తయిన తరువాత ఓట్లు లెక్కించేందుకు గతంలో ఎప్పుడూ ఇన్ని రోజుల సమయం లేదు. రాష్ట్రంలో గత నెల 11వ తేదీన అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించినా చివరి దశ ఆదివారం ముగియడంతో ఓటర్ల తీర్పు కోసం ఈసారి ఏకంగా 43 రోజులు ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

  23న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..! దగ్గర పడుతున్న సమయం..!!

  23న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు..! దగ్గర పడుతున్న సమయం..!!

  రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,118 మంది అభ్యర్ధులు ఎన్నికల్లో తలపడ్డారు. 25 ఎంపీ స్థానాలకు 319 మంది అభ్యర్ధులు పోటీ పడ్డారు. వైఎస్సార్‌సీపీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీ చేసింది. టీడీపీ లోపాయికారీ పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగింది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పరస్పరం సహకరించుకున్నాయనే విమర్శలు లేకపోలేదు.

   ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌తో ఫలితాల ట్రెండ్‌ వెల్లడి..! జగన్‌కు జైకొట్టిన ఎగ్జిట్‌ పోల్స్‌..!!

  ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌తో ఫలితాల ట్రెండ్‌ వెల్లడి..! జగన్‌కు జైకొట్టిన ఎగ్జిట్‌ పోల్స్‌..!!

  ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌కే జనామోదం లభించినట్లు తేల్చి చెప్పాయి, దీంతో ఫలితాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. టీడీపీ మాత్రం లగడపాటి చిలక జోస్యాన్ని నమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఈ ఊహలకు గురువారం మధ్యాహ్నాం తెరపడనుంది. ఈ నెల 23వతేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓటింగ్‌ సరళి ద్వారా ఎవరి జాతకాలు ఏమిటో మధ్యాహ్నం కల్లా తేలనున్నాయి.

   వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు..! తర్వాతే ఈవీఎంల లెక్కింపు..!!

  వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు..! తర్వాతే ఈవీఎంల లెక్కింపు..!!

  గురువారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒక నియోజకవర్గంలో ఈవీఎంల లెక్కింపు అన్ని రౌండ్లు పూర్తయిన తరువాత ఐదు వీవీప్యాట్‌ యంత్రాలను లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. ఆ వీవీ ప్యాట్‌ల్లోని స్లిప్‌లను లెక్కించడం పూర్తయ్యాక నియోజకవర్గ ఫలితాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేసిన తరువాత అధికారికంగా వెల్లడిస్తారు. వీవీప్యాట్‌ యంత్రాల్లో స్లిప్‌లు లెక్కించడానికి సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి ఆలస్యమైనా ఈవీఎంలు లెక్కించిన తరువాత అనధికారికంగా ఫలితం తెలుస్తుంది.

   పటిష్ట బందోబస్తు..! సంఘవిద్యోహ శక్తులకు తావులేదన్న పోలీసులు..!!

  పటిష్ట బందోబస్తు..! సంఘవిద్యోహ శక్తులకు తావులేదన్న పోలీసులు..!!

  పోలీసు సిబ్బంది కూడా విధులలో అలసత్వం లేకుండా నిరంతరాయంగా పనిచేయాలని ఉన్నతాదికారులు సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసుకోరాదని, అలానే సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు, డెకాయిట్లు, అల్లర్లకు పాల్పడే వారిపై నిఘా ఉందని చెప్పారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని పోలీసు అధికారులకు ఉన్నతాదికారులు సూచించారు. పోలీసు ఆంక్షలను ధిక్కరించిన వారిని ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

  English summary
  The exit polls released on Sunday are already aware of how the publicity will be, but the expectation is not until the official results are announced. In the past, there is no time for calculation of votes after the polling is complete.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more