ఒంటిమిట్ట చెరువులో శవాలు: అసలేం జరిగింది, చంపేశారా?

కడప: కడప జిల్లా ఒంటిమిట్ట చెరువులో కనిపించిన ఐదు శవాల ఘటన మిస్టరీగానే ఉంది. ఆనవాళ్లను బట్టి వారు తమిళ కూలీలుగా భావిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందనేది మిస్టరీగానే ఉంది.

ప్రమాదవశాత్తు వారు మరణించారా, ఎవరైనా చంపేసి అక్కడ పడేశారా అనేది అంతు చిక్కడం లేదు. ఒంటిమిట్ట చెరువులో ఆదివారం ఐదుగురి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 ఆనవాళ్లను బట్టి తమిళ కూలీలని

ఆనవాళ్లను బట్టి తమిళ కూలీలని

మృతదేహాల వద్ద లభించిన వస్తువులను, సంచులను, వారి దుస్తులను బట్ిట వారు ఎర్రచందనం దుంగల కోసం వచ్చిన తమిళ కూలీలుగా కనిపిస్తున్నారు. తమిళల కూలీలు ఇటీవలి కాలంలో కడప జిల్లాలోని అటవీ ప్రాంతంలోకి చొరబడి ఎర్రచందనాన్ని తరలించడం పరిపాటిగా మారింది. దీంతో అధికారులు దాడులు చేస్తున్నారు. కొన్నిసార్లు తమిళ కూలీలు ప్రతిదాడులు కూడా చేశారు. ఈ స్థితిలో తమిళ కూలీలు ఎర్రచందనం దుంగల కోసం వచ్చి మరణించి ఉంటారని అంటున్నారు.

 తప్పించుకోబోయి మృత్యువాత పడ్డారా...

తప్పించుకోబోయి మృత్యువాత పడ్డారా...

అడవుల్లోకి వెళ్లే క్రమంలో వారికి ఎవరైనా తారసపడి ఉంటారా, వారిని తప్పించుకునే క్రమంలో వారు చెరువులోకి దిగి మరణించారా, లేదంటే ఎవరైనా కొట్టి చంపి చెరువులోకి తోసేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శవాలు పడి ఉన్న తీరు, శవాలు పడి ఉన్న చెరువులోని నీరు చూస్తే వారు ప్రమాదవశాత్తు పడి ఉంటాని భావించడానికి వీలు లేకుండా ఉందని అనుమానిస్తున్నారు.

 ఊబిలాంటిదేమీ లేదు..

ఊబిలాంటిదేమీ లేదు..

చెరువులో రెండు నుంచి మూడున్నర అడుగుల లోతు నీరు మాత్రమే ఉంది. అంతేకాకుండా ఊబిలాంటిది కూడా ఏమీ లేదు. చెరువులో పెద్దగా కంపచెట్లు కూడా ఏమీ లేవు. అందువల్ల వారు చెరువులో మునిగి చనిపోయారని భావించడానికి వీలు లేకుండా ఉంది. చెరువు కట్ట మీదే కడప - తిరుపతి ప్రధాన రహదారి కూడా ఉంది. అది ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఐదుగురు ప్రమాదంలో చిక్కుకుని ఉంటే కనిపించకుండా ఉంటుందా, వారు కేకలు వేస్తే వినిపించకుండా ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

చంపేసి పడేశారా...

చంపేసి పడేశారా...

చెరువు లోతును బట్టి చూసినా, అందరూ ఒకే చోటు ఉండడం వల్ల కాపాడుకునేందుకు అవకాశం ఉన్నందున ప్రమాదం కాదని భావిస్తున్నారు. వాళ్ల శరీరాలపై చిన్నపాటి గాయాలున్నాయి. ముగ్గురికి నాలుకలు బయటకు వచ్చి ఉన్నాయి. దీని వల్ల వారి మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాటిని బట్టి కూడా చెప్పవచ్చు

వాటిని బట్టి కూడా చెప్పవచ్చు

వారి వద్ద కిట్ బ్యాగ్‌లు, ఆ బ్యాగుల్లో టార్చిలైట్లు, పచ్చళ్లు, చిరు తిండ్ల వంటివి ఉన్నాయి. షార్ట్స్ వేసుకున్నారు. నడుముకు లుంగీలు చుట్టుకున్నారు. కాళ్లకు బెల్టు చెప్పులు వేసుకున్నారు. వీటిని బట్టి చూస్తే వాళ్లు తమిళ కూలీలనే భావిస్తున్నారు. వారివద్ద ఉన్న ఓ పాస్‌పోర్టు సైజు ఫొటోతో పాటు మరో రెండు మహిళల ఫొటోలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 పూర్తిగా దర్యాప్తు చేస్తాం...

పూర్తిగా దర్యాప్తు చేస్తాం...

ఐదుగురి శవాల ఘటనప 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని కడప ఓఎస్డీ అద్నాన్ నయీం చెప్పారు. వారు గుర్తు తెలియని వ్యక్తులని, వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారా, మరేదైనా కారణంతో వారు మరణించారా అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని ఆయన చెప్పారు. మృతుల వివరాలను ఫొటోలను గోడ పత్రాలపై ముద్రించి ఇతర జిల్లాలతో ాటు పక్క రాష్ట్రాలకు కూడా తెలియజేస్తామని అన్నారు. ప్రధాన రహదారిపై నిత్ంయ పోలీసుల గస్తీ ఉంటుందని, వారు ఇక్కడే చనిపోయి ఉంటారనే సమాచారం తమ వద్ద లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+