జగన్ మాట మార్చారు: కాపుల రిజర్వేషన్లపై యూటర్న్ అంటూ ఊమెన్ చాందీ ఫైర్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కాపుల రిజర్వేషన్ల విషయంలో యూటర్న్ తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ ఆరోపించారు. కాకినాడ పర్యటన కోసం బెంగుళూరు నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని నాలుగేళ్లుగా చెబుతున్న జగన్.. ఇప్పుడు మడమ తిప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కాపులకు అండగా ఉంటుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాపులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియ వేగంగా సాగుతున్నట్లు చాందీ తెలిపారు.
2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదాకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో.. కాపులకూ అంతే ప్రాధాన్యత ఇస్తుందని చాందీ స్పష్టం చేశారు. కాగా, కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని సాధ్యం కాని హామీలను తాము ఇవ్వలేమని ఇటీవల జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications