సీఎం జగన్ గెలుపు ధీమా వెనుక ఆ నలుగురు - సైలెంట్ ఆపరేషన్..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 అంటూ మరోసారి అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి లక్ష్యంగా ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు లాంఛనమే. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. జగన్ సింగిల్ గానే పోటీ చేస్తానని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారం దక్కుతుందనే ధీమా వెనుక అనేక కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.

మారుతున్న రాజకీయం
ఏపీలో 2024 ఎన్నికలపైన ఆసక్తి పెరిగింది. ఎన్నికల ప్రచారం అన్నట్లుగానే పార్టీలు పోటీ పడుతున్నాయి. పొత్తు రాజకీయంతో ప్రతిపక్షాలు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నాయి. నారా లోకేశ్ యువగళం, పవన్ వారాహి యాత్ర, చంద్రబాబు జిల్లాల పర్యటనలతో ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్నారు.

 CM Jagan

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన పురందేశ్వరి జగన్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. కేంద్రం లో అవసరమైన సమయంలో వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. కేంద్రంలోని ముఖ్యులతో సీఎం జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అటు ఎన్డీఏలో పవన్ కొనసాగుతున్నారు. టీడీపీ త్వరలో ఎన్డీఏలో చేరుతుందనే ప్రచారం సాగుతోంది. దీంతో, ఏపీలో బీజేపీ రాజకీయం అంతు చిక్కకుండా ఉంది.

సీఎం వైనాట్ 175 ధీమా
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే సీఎం జగన్ 2024 ఎన్నికల కోసం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే అధికారిక పొత్తుకు మాత్రం దూరంగా ఉన్నారు. బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతున్న వేళ టీడీపీతో వైఖరి ఏంటనేది తేలటానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

 CM Jagan

మూడు పార్టీలు కలవటం ఖాయమైతే మరోసారి ప్రత్యేక హోదా తో పాటు పలు అంశాలు మరోసారి రాజకీయంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో చేస్తున్న సీట్ల ప్రకటనలతో టీడీపీ అలర్ట్ అవుతోంది. బీజేపీ కూడా కలిస్తే సీట్ల పంచాయితీ తప్పదనేది వైసీపీ అంచనా. పార్టీల నేతలు చివరి నిమిషంలో కలిసినా..కింది స్థాయిలో కేడర్ ఎన్నికల వేళ అంత సులభంగా కలవరనేది వైసీపీ సీనియర్ల విశ్లేషణ. బీజేపీ చివరి నిమిషంలో టీడీపీతో పొత్తుకు నో చెబితే పవన్ నిర్ణయం మరింత కీలకంగా మారుతుంది.

పొత్తులు..ఎత్తులతో ముందుకు
ఇదే సమయంలో మరోసారి జగన్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయనేది వైసీపీ బలంగా ప్రచారంలోకి తీసుకొస్తున్న అంశం. జగన్ ను ఒంటరిగా ఓడించలేకనే పవన్- చంద్రబాబు కలుస్తున్నారనే ప్రచారం ప్రారంభించారు. ఇక, పవన్ తన యాత్రల్లో భాగంగా సీఎం జగన్ ను ఏక వచనంతో మాట్లాడటం.. హెచ్చరికలు చేయటం చర్చనీయాంశంగా మారింది.

 CM Jagan

జగన్ వైఫల్యాలను చెబుతూ..తాము అధికారంలోకి వస్తే ఏ రకమైన పాలన ఇస్తామో చెప్పకుండా పవన్ ప్రతీ సభలో జగన్ పైన ద్వేషంతో ప్రసంగాలు చేస్తున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే తరహాలో చంద్రబాబు, లోకేశ్ తమకు తిరిగి అధికారం దక్కితే ఏం చేస్తామనే చెప్పే అంశాల కంటే జగన్ ను అవసరానికి మంచి టార్గెట్ చేస్తున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి.

కలిసొచ్చేదెవరికి
పురందేశ్వరి సైతం ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో చేస్తున్న వ్యాఖ్యలపైన చర్చ సాగుతోంది. అటు జగన్ మాత్రం తాను చేసిన సంక్షేమం తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఇప్పటి వరకు 2.43 లక్షల కోట్ల సంక్షేమ లబ్ది బ్యాంకు ఖాతాల ద్వారా అందించినట్లు చెబుతున్నారు. ప్రతీ ఇంటికి మంచి జరిగితేనే తనకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.

తాజాగా జగనన్న సురక్ష ద్వారా మరింతగా గుర్తించిన అర్హులకు ఆగిన ఫించన్ల పునరుద్దరణ.. పథకాల్లో అవకాశం కల్పించేలా నిర్ణయించారు. దీన ద్వారా ఓట్ బ్యాంక్ మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా జగన్ ను విమర్శించటం.. ప్రస్తుత సంక్షేమానిని ధీటుగా తాము ఏం చేస్తామో చెప్పలేకపోవటం ప్రతిపక్షాల వైఫల్యంగా కనిపిస్తోంది. ఇవన్నీ జగన్ కు తిరిగి అధికారంలోకి రావటానికి మేలు చేస్తాయనేది వైసీపీ నేతల అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+