Pawan Kalyan:సౌత్ పాలిటిక్స్‌లో "పవన్"అస్త్రం ప్రయోగం..!!

ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కేంద్రం జమిలి దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి బిల్లు ప్రతిపాదించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో విజయం తరువాత బీజేపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ సమయంలోనే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వైపు బీజేపీ అధినాయకత్వం చూస్తోంది.దీంతో ఎన్డీఏ భవిష్యత్ రాజకీయా వ్యూహాల్లో పవన్ పాత్ర కీలకం కానుందనే అంచనాలు మొదలయ్యాయి.

ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సునామీ సృష్టించారు. ఇది కొందరికి జీర్ణం కాకపోవచ్చుకానీ వాస్తవం ఇదే. పవన్ కళ్యాణ్ విజయం వెనుక చాలా కృషి ఉంది. రాజకీయాల్లో సక్సెస్ పవన్‌కు అంత సులభంగా రాలేదు.2019లో ఒక్క సీటుతో జనసేన ప్రయాణం ప్రారంభమై అది 2024లో వందశాతం స్ట్రైక్‌రేటుతో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకుంది. ఇక 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు సీట్లలో ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా ప్రజలపక్షాన పోరాటం చేసి 2024లో తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు.ఒక్కసారిగా దేశంలోని రాజకీయ పార్టీల దృష్టి పవన్‌పై మర్లింది.ఇక మహారాష్ట్ర, తమిళనాడుల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం ఫలితాన్ని ఇవ్వడంతో బీజేపీ అధినాయకత్వం పవన్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు సిద్ధమవుతోంది.

OPINION BRAND PK GOES BEYOND AP THE TRUMP CARD NDA NEEDED DOWN SOUTH

ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్ అయ్యారు. తిరుపతి లడ్డూ అంశం వివాదాస్పదంగా మారడం పవన్ ఎంట్రీతో ఆ అంశం మరొక టర్న్ తీసుకుంది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ నెలలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.దీంతో పవన్ కళ్యాణ్ కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. హిందువుల ఐక్యత కోసం పిలుపునిచ్చారు.వారాహి డిక్లరేషన్ ఇచ్చారు.

తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ తమిళంలో మాట్లాడటంతో తమిళ ప్రజలు కూడా ఫిదా అయ్యారు.పవన్ కళ్యాణ్‌ను ప్రశంసిస్తూ ఆన్‌లైన్‌లో తమిళ ప్రజలు పోస్టులు పెట్టారు. దీంతో పవన్ స్టామినా తమిళనాడును టచ్ చేసింది.అక్కడ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రాండ్ క్రియేట్ అయ్యింది.ఇక మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన మెజార్టీ స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించడంతో పవన్ ఇమేజ్ మరో లెవెల్‌కు చేరుకుంది. వివిధ ప్రాంతాలకు రాష్ట్రాలకు చెందిన ఎన్డీయే నేతలు సోషల్ మీడియా వేదికగా పవన్‌కు అభినందనలు తెలిపారు. పవన్ చేసిన కృషిని ప్రశంసించారు.దీంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాన్ ఇండియా లీడర్‌గా ఎదిగారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

OPINION BRAND PK GOES BEYOND AP THE TRUMP CARD NDA NEEDED DOWN SOUTH

అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తన శాఖనే కాకుండా ఇతర శాఖలపై కూడా పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ ఎక్కడైన అవకతవకలు జరిగినట్టు తన దృష్టికి వస్తే దుమ్ము రేగొడుతున్నారే అభిప్రాయం ఏపీ ప్రజల్లో నెలకొంది. దీంతో పవన్ పై క్రెడిబులిటీ పెరిగింది. ఇటు ఢిల్లీ పెద్దల్లో అటు కూటమి నేతల్లో పవన్ పై మరింత విశ్వాసం పెరిగింది. ఇక కాకినాడ ఎపిసోడ్‌లో 'సీజ్ ది షిప్' అని పవన్ చెప్పిన మాట కొద్ది రోజుల పాటు ట్విటర్‌లో ఇతర సోషల్ హ్యాండిల్స్‌లో ట్రెండ్ అయ్యింది. స్వయంగా డిప్యూటీ సీఎం బోట్‌లో వెళ్లి,స్మగ్లింగ్‌కు గురవుతున్న రేషన్ బియ్యంను పట్టుకుని అధికారులను సస్పెండ్ చేయమని చెప్పడం ఆయన్ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ వ్యవహారం కూటమిలోని నేతలు కొందరికి రుచించలేదు. కానీ పవన్ వ్యవహరించిన తీరుపై ఢిల్లీ పెద్దలు అభినందించారు.

దక్షిణాదిలో బీజేపీ అస్త్రంగా పవన్

రాజకీయాల్లో దక్షిణాది రాజకీయాలు ఉత్తరాదితో పోలిస్తే వేరుగా ఉంటాయి.దక్షిణాదిలో హిందూత్వ రాజకీయాలు ఇంకా అంత లోతుగా జనాల్లోకి వెళ్లలేదు. ఇక్కడ కుల రాజకీయాలకున్న ప్రాధాన్యత మతరాజకీయాలకు ఉండదు. ఉత్తరాదిలో హిందువులను ఏకంచేసే ఫార్ములా వర్కౌట్ అవుతుంది. దక్షిణాదిలో ఇది సాధ్యపడటం లేదు. దీంతో బీజేపీ పవన్ అనే అస్త్రాన్ని దక్షిణాదిలో ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఓ వైపు మెజార్టీ ఓటర్లను ఆకట్టుకుంటూనే మైనార్టీ ఓటు బ్యాంకును కూడా తమవైపు మరల్చుకోగల వ్యక్తి కోసం బీజేపీ చూస్తోంది. ఇప్పుడు వారికి పవన్ కళ్యాణ్ సరైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాను నమ్మే సనాతన ధర్మం కోసం ఒక అడుగు ఎక్కువగానే ముందుకెళ్లి ఉండొచ్చు కానీ ఇతర మతాలను ఆయన కించపరిచే పని ఎప్పుడూ చేయలేదు. తను అన్ని మతాలను గౌరవిస్తానని పలుసందర్భాల్లో చెప్పారు. తన అభిమానులు కూడా అలానే ఉండాలంటూ చెప్పుకొచ్చారు. ఇక తన కూతురు తిరుమల ఆలయంలో డిక్లరేషన్ ఇప్పించడం ద్వారా పవన్ గట్టి సందేశాన్ని పంపారు.

మొత్తానికి ఇటు జనంలో క్రేజ్ ఉండటం ఇతర రాష్ట్రాల్లో పవన్ సత్తా చాటడంతో ఎన్డీయేకు ట్రంప్ కార్డుగా పవర్ స్టార్ కనిపిస్తున్నారు.పవన్ అస్త్రం ప్రయోగించి ఎన్డీయే దక్షిణాదిలో పాగా వేసేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+