చంద్రబాబు-పవన్ బిగ్ మిస్టేక్ : జగన్ కు అదే వరం, బిగ్ టర్న్..!!

ఏపీలో ఎన్నిక సమరం మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ - జనసేన ఒక్కటయ్యాయి. బీజేపీని తమతో కలుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. సీఎం జగన్ సింగిల్ గానే ఫైట్ చేస్తానని చెబుతూ..వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ఇప్పటికే ఒక విధంగా ప్రచారం ప్రారంభించారు. ప్రతిపక్షాలు ఇంకా పొత్తుల లెక్కల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి.

అధికారం దక్కేదెవరికి : ఏపీలో అధికారం దక్కేదెవరికి. అటు చంద్రబాబు కేసుల్లో ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ -జనసేన కలిసినా కేడర్ లో జోష్ పెరగటం లేదు. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. తన పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపారు. జగన్ తనకు తిరిగి అధికారం ఖాయమనే ధీమాతో ఉన్నారు. జగన్ ట్రాప్ లో ప్రతిపక్షాలు చిక్కుకున్నట్లు స్పష్టం అవుతున్నాయి. జగన్ సెట్ చేసిన సంక్షేమ అజెండా చుట్టూనే ప్రతిపక్షాలు ఇప్పుడు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Opinion: CM Jagan strategically targetting the opponenets to win Elections in 2024, Will people Accept

కాదంటే, మెజార్టీ ఓట్ బ్యాంక్ నష్టపోవాల్సిందే. అదే సమయంలో జగన్ కంటే సంక్షేమంలో టీడీపీ - జనసేన వైపు జనం మొగ్గే అవకాశం లేదు. జగన్ వ్యూహాత్మకంగా సంక్షేమం - సామాజిక న్యాయం ఎన్నికల అజెండాగా సెట్ చేసారు. కానీ, టీడీపీ -జనసేన పూర్తిగా జగన్ వ్యతిరేకత ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకుంది. అసలు జగన్ వ్యతిరేక ఓటింగ్ శాతం ఎంత. ఇది ఏ మేరకు అధికారంలోకి రావాటానికి ఆ రెండు పార్టీలకు సహకరిస్తుందనేదే ఇప్పుడు చర్చ.

జగన్ ట్రాప్ లో ప్రతిపక్షాలు : జగన్ 54 నెలల కాలంలో ఇప్పటి వరకు పాలనా పరమైన అంశాల్లో వైఫల్యాలు ఎత్తి చూపటంలో ప్రతిపక్షాలు దాదాపుగా విఫలమయ్యాయి. జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని చంద్రబాబు, పవన్ పదే పదే ఆరోపణలు కొనసాగిస్తున్నారు. కానీ, తమకు ఎందుకు అధికారం అవసరం అనేది చెప్పటంలో ఇప్పటి వరకు చొరవ చూపించలేదు. అనుకూల ఓటు కంటే రిజెక్షన్ ఓట్ తో లాభపడాలని ప్రయత్నిస్తున్నాయి.

అయితే, ఆ స్థాయిలో అసలు జగన్ పైన వ్యతిరేకత ఉందా అంటే లేదనే సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ పైన ఉన్న వ్యతిరేకత కంటే పాజిటివ్ ఓటింగ్ వైసీపీకి కలిసొచ్చే అంశంగా మారుతోంది. 60 శాతం వరకు వైసీపీకి అనుకూల ఓటింగ్ ఉందని స్వతంత్ర సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల నాటికి కొంత మేర తగ్గినా..అధికారం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నాయి. అసలు జగన్ ను ఎందుకు రిజెక్ట్ చేయాలి..తమను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనేది చెప్పటంలో ఇప్పటి వరకు చంద్రబాబు - పవన్ వెనుకబడి ఉన్నారు.

Opinion: CM Jagan strategically targetting the opponenets to win Elections in 2024, Will people Accept

పక్కా సమీకరణాలతో : ఈ రెండు పార్టీలు ఎన్నికల సమరంలో యాక్టివ్ అయ్యే సరికి..జగన్ తన పని తాను చేసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో 1 కోటి 60 లక్షల కుటుంబాల్లో దాదాపు 1 కోటి 40 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సంక్షేమ లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేసి అందించారు. చంద్రబాబు-పవన్ గతంలో ఇచ్చిన హామీలు అమలు కాని విషయాన్ని గుర్తు చేస్తూ..తాను అధికారంలోకి రాకపోతే సంక్షేమం కొనసాగదనే నమ్మకం కలిగిస్తున్నారు.

ఇదే ఇప్పుడు టీడీపీ -జనసేనకు మైనస్ అవుతోంది. ఈ రెండు పార్టీలు తాము సంక్షేమం చేస్తామని చెప్పినా మద్దితిచ్చే వారి సంఖ్య తక్కవేనని స్పష్టం అవుతోంది. సంక్షేమం- ఏపీ పునర్నిర్మాణం పేరుతో ప్రజల్లోకి వచ్చినా..ఎంత వరకు మద్దతు ఉంటుందనేది సందేహమే. దీంతో, ఎన్నికల నాటికి ప్రతిపక్షాలు ఓటర్ల వద్దకు ఏ అంశాలతో వెళ్తాయి.. జగన్ ఏ వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+