వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కీలక నిర్ణయం: నర్సాపురంకు జాతీయ స్థాయి గుర్తింపు - వైసీపీ ఖాతాలోనే..!!

|
Google Oneindia TeluguNews

నర్సాపురం ఏపీలో భౌగోళికంగా..రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రాంతం. కేంద్రం సాధ్యం కాదన్నా..నర్సాపురంలో ఇచ్చిన మాట కోసం జగన్ కేంద్రాన్ని ఒప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్దం అవుతున్న 9 ఫిష్షింగ్ హార్బర్ లతో పాటుగా తాజాగా బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌కు ముందుకొచ్చారు. నర్సాపురం పర్యటనలో భాగంగా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. ఇదే సమయంలో నర్సాపురం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయం కు శంకుస్థాపన నిర్వహించారు. దేశంలోనే ఇది మూడో యూనివర్సిటీ. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలో మాత్రమే ఈ వర్సిటీలు ఉన్నాయి.

నర్సాపురం కేంద్రంగా ఆక్వా యూనివర్సిటీ
ఆక్వా వర్సిటీ కోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లోని సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. భవన నిర్మాణ పనుల కోసం రూ.332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ ఆమోదించారు. మొదటి దశలో పరిపాలన భవనంతో పాటు విద్యార్థులకు వసతి గృహాలు, విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. 2022-23 బడ్జెట్‌లో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు రూ.40 కోట్లు కేటాయించారు. బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ.222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం, పరిశోధన కేంద్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు, ఆక్వా రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వా రంగంలో నష్టాలను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా సంవత్సరానికి రూ.4,000 నుంచి 5,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది.

 Opinion:Narsapuram gets special recognizition with CM Jagan-Aqua University foundation stone laid,third in the country

ప్రభుత్వ పరిశీలనలో మత్స్య కళాశాలలు
అవసరమైన సంఖ్యలో ఫిషరీస్‌ డిప్లొమా, బీఎఫ్‌ఎస్‌సీ, ఎంఎఫ్‌ఎస్‌సీ, పీహెచ్‌డీ అర్హత గల అభ్యర్థులను తయారు చేయడానికి ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు, మత్స్య పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.429.43 కోట్ల అంచనాతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన అనుమతులు మంజూరు చేసింది. హార్బర్‌ నిర్మాణం ద్వారా మత్స్యకారులు అత్యంత సామర్థ్యం గల మోటారు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వేటకు వెళ్లేందుకు వీలుంటుంది. మార్కెటింగ్‌ సౌకర్యాలను పెంపొందించడం ద్వారా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ హార్బర్‌ నిర్మించే ప్రదేశం నరసాపురం పట్టణానికి 14 కి.మీ. దూరంలో ఉంది.

నర్సాపురంలో సీఎం జగన్ కొత్త చరిత్ర
దీనివల్ల నరసాపురం, మొగల్తూరు మండలాలకు చెందిన 6,000 మంది మత్స్యకారులు లబ్ధి పొందనున్నట్లు అంచనా. నరసాపురం మండలం నందలి వేములదీవి ఉప గ్రామమైన దర్బరేవు గ్రామంలో నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం 1921లో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీ లిమిటెడ్‌కు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది. ఆ రోజు నుంచి 1,623 మంది రైతులు ఆ భూమి స్వాధీన అనుభవంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ రైతులకు ఎటువంటి భూ యాజమాన్య హక్కులు కానీ, రెవెన్యూ రికార్డు పరమైన హక్కులు కానీ లేవు. సీఎం జగన్ వీరికి మేలు జరిగేలా ఎకరాకు రూ.100 ధర నిర్ణయించి, ఆ 1,623 మంది రైతులకు భూ యాజమాన్య, రెవెన్యూ రికార్డు పరమైన సర్వహక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నర్సాపురం రాజకీయంగానూ ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ కు కీలకం. అయితే, నర్సాపురం కేంద్రంగా తీసుంటున్న నిర్ణయాలు వైసీపీ క్రెడిట్ గా నాయకులు చెబుతున్నారు.

English summary
CM Jagan decided to give special allocations fo Narsapuraram, CM JAgan laid foundation stone for Aqua University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X