తొలిసారి విపక్షాల్ని మెప్పించిన జగన్- ఆ నిర్ణయం ప్రభావమెంత ? ఇక ఎవరి లెక్కలు వారివే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ విపక్షాలతో సీఎం జగన్ పోరు కొనసాగుతూనే ఉంది. ప్రజావేదిక కూల్చివేతతో టీడీపీతో ప్రారంభమైన ప్రత్యక్ష పోరు... ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. అలాగే మిగతా విపక్ష పార్టీల్ని జగన్ అస్సలు లెక్కచేయరనే పేరుంది. దీంతో ఆయా పార్టీలు కూడా జగన్ అంటేనే మండిపడే పరిస్ధితి. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతించలేని పరిస్ధితి. అలాంటి నేపథ్యంలో తాజాగా జగన్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని విపక్షాలు పరోక్షంగానైనా స్వాగతిస్తున్నాయి.

జగన్ వర్సెస్ విపక్షాలు
ఏపీలో జగన్ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న పోరు ఇప్పటికీ సజీవంగానే ఉంది. మిగతా రాష్ట్రాలతో విపక్షాలతో అధికార పక్షం వ్యవహారశైలికి భిన్నంగా వారిని టార్గెట్ చేస్తున్నారనే విమర్శల్ని జగన్ ఎదుర్కొంటున్నారు. దీంతో విపక్షాలు కూడా బూతు వ్యాఖ్యలతో సైతం జగన్ పై విరుచుకుపడుతున్నాయి. దీంతో జగన్ వర్సెస్ విపక్షాల పోరు ఏపీ చరిత్రలోనే అత్యంత హోదాహోరీ అన్నట్లుగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

డీజీపీ ఆకస్మిక బదిలీ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం జగన్ ఏరికోరి తెచ్చుకున్న డీజీపీ గౌతం సవాంగ్. రెండున్నరేళ్ల పాటు నిర్విఘ్నంగా తన పని తాను చేసుకుపోయిన సవాంగ్.. ఈ కాలంలో చాలా సార్లు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. జగన్ కోసం ఎందాకైనా వెళ్లేైందుకు సిద్ధపడుతున్నారన్న విమర్శలు సవాంగ్ పై వినిపించేవి. ప్రభుత్వ చర్యలకు హైకోర్టులో సైతం ఆయన సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి డీజీపీని ఆ పదవిలోని ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసేసింది. దీంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

జగన్ నిర్ణయంపై విపక్షాల హ్యాపీ
జగన్ తీసుకున్న ఈ ఆకస్మిక బదిలీ నిర్ణయాన్ని విపక్షాలు స్వాగతిస్తున్నాయి. ప్రత్యక్షంగా స్వాగతించడానికి ఇగో అడ్డు వస్తున్నా పరోక్షంగా మాత్రం సవాంగ్ బదిలీ కావడంపై విపక్షాలు మాత్రం లోలోపల స్వాగతిస్తున్నాయి. ఈ రెండున్నరేళ్లలో విపక్షాలకు ఇంతగా ఊరటనిచ్చిన నిర్ణయం మరొకటి లేదంటే కూడా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఈ రెండున్నరేళ్లలో జగన్ చెప్పినట్టల్లా విని తమను సవాంగ్ దారుణంగా టార్గెట్ చేశారని విపక్షాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో జరిగిన ఈ ఆకస్మిక బదిలీ వారికి ఎంతో ఊరటనిస్తోంది.

సవాంగ్ కు తగిన శాస్తి జరిగిందంటూ
డీజీపీ పదవి నుంచి గౌతం సవాంగ్ ను బదిలీ చేయడంపై విపక్షాలు లోలోపల సంతోషంగా ఉన్నా బయటికి మాత్రం ఆయనపై విరుచుకుపడుతున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని వదిలిపెట్టి సవాంగ్ పైనే విమర్శలకు దిగుతున్నాయి. ఆయనకు తగిన శాస్తి జరిగిందని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. పాలక వర్గానికి కొమ్ము కాస్తే ఇలానే జరుగుతుందని పేర్కొన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ లాంటి వారిని ఏపీ ప్రభుత్వం ఇలాగే వాడుకుందన్నారు. సవాంగ్ ఉదంతం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చెంప పెట్టులాంటిదని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. అటు టీడీపీ కూడా ఇదే తరహాలో స్పందిస్తోంది. జగన్ కోసం రెచ్చిపోయిన సవాంగ్ రిటైర్మెంట్ చివరి వరకూ ఆ పదవిలో ఉంటారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఆయినా కరివేపాకులా తీసిపారేశారని, దీంతో మిగతా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పటికైనా ఇలాంటి ఘటనలతో గుణపాఠం నేర్చుకోవాలని సూచిస్తోంది.

ఇక ఎవరి లెక్కలు వారివే
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక డీజీపీగా బాధ్యతలు చేపట్టిన గౌతం సవాంగ్.. ఈ రెండున్నరేళ్లలో జగన్ సూచనల మేరకు తమను దారుణంగా టార్గెట్ చేశారని వాపోతున్న విపక్షాలు.. కొత్త డీజీపీ రాకతో కొంతకాలం పాటు మౌనం వహించే సూచనలు కనిపిస్తున్నాయి, కొత్త, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పనితీరు చూసిన తర్వాతే ఆయన విషయంలో స్పందించే అవకాశముంది. దీంతో కనీసం కొంతకాలం పాటైనా డీజీపీ వర్సెస్ విపక్షాల పోరుకు బ్రేక్ లభించినట్లయింది. ఆ మేరకు ప్రభుత్వానికి కూడా విమర్శల నుంచి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications