విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు మాట్లాడవేం: కల్పన, 'రాజధాని చుట్టూ అరాచకశక్తులు': 'కాల్ మనీ' వీరే (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై సిబిఐసీఐడీచే విచారణ జరిపించాలని వైసిపి ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేసారు. టిడిపి నేతలే సూత్రధారులుగా ఉండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలన్నారు.

కాల్ మనీ ముసుగులో మహిళల పన జరుగుతున్న అకృత్యాలను ఏపీ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. కాల్ మనీ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఆమె మండిపడ్డారు.

అమరావతి చుట్టూ అరాచక శక్తులు: రాఘవులు

కాల్ మనీ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని సిపిఎం నేత రాఘవులు ఆదివారం డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి చుట్టూ అరాచక శక్తులు ఉన్నాయని ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణ ఖర్చు పైన అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాల్ మనీ నిందితులను శిక్షించాలన్నారు.

కాల్ మనీ

కాల్ మనీ

కాల్ మనీ వ్యవహారంలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. మహిళలకు అప్పులు ఇచ్చి, వారు అప్పు తీర్చకుంటే వ్యభిచార రొంపిలోకి దింపుతుంటారు.

కాల్ మనీ

కాల్ మనీ

ట్రస్ట్ పేరిట మహిళలకు ఎర వేస్తున్నారు. వారికి బడాబాబుల అండ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

కాల్ మనీ

కాల్ మనీ

మహిళలకు, అవసరంలో ఉన్న వారికి రూ.5 నుంచి రూ.35 వడ్డీకి అప్పులు ఇస్తారు. తలకు మించిన వడ్డీలు కట్టలేక బాధితులు ఊబిలో కూరుకుపోతారు.

కాల్ మనీ

కాల్ మనీ

మహిళా బాధితులను బెదిరించి వ్యభిచార రొంపిలోకి దింపుతారు. వాటిని వీడియోలుగా తీసి, బయట పెడతామని బెదిరించి, వారి కుటుంబ సభ్యులను కూడా ఆ రొంపిలోకి దింపే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి షాకింగ్‌లు కాల్ మనీ దందాలో వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది.

English summary
Opposition seeks judicial probe into call money episode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X